
ప్రముఖ యూట్యూబర్లు షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ షో వీళ్లకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ షో ద్వారా తొలుత దీప్తి సునయన ఎంట్రీ ఇవ్వగా గత ఏడాది జరిగిన సీజన్‌లో షణ్ముఖ్ వెలుగులోకి వచ్చాడు. వీళిద్దరూ వేర్వేరుగా క్రేజ్ సంపాదించుకున్న అనంతరం ఇద్దరి మనసులు కలవడంతో లవ్ చేసుకున్నారు. అయితే బిగ్‌బాస్ షో వల్ల షణ్ముఖ్ లవ్‌కు బ్రేక్ పడింది. ముఖ్యంగా సిరి హన్మంత్‌తో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండటం, పదే పదే కిస్‌లు పెట్టడంతో దీప్తి సునయన హర్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి షన్నూ, దీప్తి విడివిడిగానే ఉంటూ ఎవరికి వారే తమ తమ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా ఒక్కటయ్యారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఒకే పోస్టు చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇటీవల షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హౌస్‌లో ఉన్న అషు రెడ్డి దీప్తి గురించి కొన్ని ప్రశ్నలను షన్నూకి సంధించింది. దీప్తి ఎలా ఉంది అంటూ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా షన్నూ దీప్తి బాగానే ఉందని చెప్పాడు. త్వరలోనే తనను కలవబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో అతడి అభిమానులు షన్నూ – దీప్తి మళ్లీ కలవబోతున్నారని ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొన్ని నెలల క్రితమే బ్రేకప్ చెప్పుకుని విడిపోయిన షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా జంట మళ్లీ కలవాలని వాళ్లిద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసి వాళ్లను అభ్యర్ధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షణ్ముఖ్, దీప్తి మరోసారి కలిశారు. అయితే వీళ్లిద్దరూ కలిసింది బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో ఫినాలేకు చేరిన అఖిల్ సార్థక్ కోసం మాత్రమే.
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న బలమైన కంటెస్టెంట్లలో అఖిల్ సార్థక్ ఒకడు. దీంతో అతడికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ఒకవైపు షణ్ముఖ్ జస్వంత్, మరోవైపు దీప్తి సునయన తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తున్నారు. జంటగా విడిపోయిన వీళ్లిద్దరూ ఇలా అఖిల్ సార్థక్‌ను గెలిపించేందుకు ఒక్కటయ్యారని చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్ ద్వారా విడిపోయిన వీరి జంట మళ్లీ బిగ్‌బాస్ కోసమే కలుస్తున్నందుకు ఆనందంగా ఉందని పలువురు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా మరోవైపు దీప్తితో బ్రేకప్ అయిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల అతడు తన కొత్త వెబ్ సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ను ప్రకటించాడు. దీన్ని సుబ్బు అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తోంది. మరోవైపు దీప్తి సునయన కూడా తన కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే షణ్ముఖ్ స్నేహితురాలు సిరి కూడా వెబ్ సిరీస్‌లను చేస్తూ బిజీగా మారింది. ఆమె బీఎఫ్‌ఎఫ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. విచిత్రం ఏంటంటే.. షన్నూ, సిరి నటిస్తున్న వెబ్ సిరీస్‌లు ఆహా ఓటీటీలోనే ప్రసారం కానున్నాయి.