Home Uncategorized మల్లెమాల సంస్థ ని నమ్మి విలువైన ఆస్తిని పోగొట్టుకున్న శేఖర్ మాస్టర్

మల్లెమాల సంస్థ ని నమ్మి విలువైన ఆస్తిని పోగొట్టుకున్న శేఖర్ మాస్టర్

0 second read
0
0
694

శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో అతడు ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గా టాప్ స్థానంలో ఉన్నాడు. పదేళ్ళ కింద రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి ఆ తర్వాత డాన్స్ మాస్టర్‌గా మారి ఇప్పుడు టాప్ కొరియోగ్రఫర్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి.. యువ హీరోల వరకు అందరికీ కొరియోగ్రఫీ చేసేది శేఖర్ మాస్టరే. ఓవైపు షూటింగ్‌లతో ఫుల్‌గా బిజీగా ఉంటూనే శేఖర్ మాస్టర్ మరోవైపు కొన్ని టీవీ షోలలోనూ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో ప్రముఖ డ్యాన్స్ షో ఢీకి శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించేవాడు. అప్పుడప్పుడు జబర్దస్త్‌లోనూ జడ్జిగా వ్యవహరిస్తుంటారు. దీంతో మల్లెమాల సంస్థతో శేఖర్ మాస్టర్‌కు మంచి అనుబంధం ఉంది. స్టార్ మాలో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌లో జడ్జిగానూ వ్యవహరిస్తున్నాడు. అయితే ఢీ షో కోసం ఒక్కో ఎపిసోడ్‌కు శేఖర్ మాస్టర్ లక్షల్లో పారితోషికం తీసుకునేవాడు. ఇప్పటికీ శేఖర్ మాస్టర్ అంటే కేరాఫ్ ఢీ అనే అంటారు. అయితే అంత పేరున్న షోలో ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు.

ఢీ సీజన్-14లో శేఖర్ మాస్టర్ కనిపించకపోవడానికి కారణం మల్లెమాలతో విభేదాలే కారణమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఢీ 13 మధ్యలోనే శేఖర్ మాస్టర్ బయటికి వచ్చేసాడు. ఢీ14లో శేఖర్ మాస్టర్ స్థానంలో మరో కొరియోగ్రఫర్ గణేష్ వస్తున్నాడు. అయితే ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్‌ను తప్పించడానికి గల కారణాలేంటి అంటూ ఆయన అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. దీనికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్‌ను తప్పించడానికి ప్రధాన కారణం ఆయన రూల్స్ బ్రేక్ చేయడమే. మల్లెమాలతో బాండ్ ప్రకారం ఇక్కడ షో చేస్తున్నపుడు మరో ఛానెల్‌కు వెళ్లి అక్కడే షో చేయకూడదు. అయితే శేఖర్ మాస్టర్ మాత్రం మా టీవీలో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వెళ్లాడు. దీంతో మల్లెమాల యూనిట్ శేఖర్ మాస్టర్‌ను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశంపై ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందించాడు. ఓంకార్‌తో మంచి అనుబంధం ఉండటం వల్ల ఆయన అడిగారని కామెడీ స్టార్స్ షోకు జడ్జిగా వెళ్లానని చెప్పాడు.

అయితే ఈ విషయం ఢీ నిర్వాహకులకు చెప్పానని.. ఇది డ్యాన్స్ షో.. కామెడీ స్టార్స్ కామెడీ షో కాబట్టి ఇబ్బంది లేదని మల్లెమాల వాళ్లు చెప్పారని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. కొన్నిరోజుల తర్వాత చిన్న ఇష్యూ వచ్చిందని.. దీంతో మాటీవీలో మానేసి ఈటీవీకి రావాలని మల్లెమాల వాళ్లు చెప్పారని.. కానీ తాను మాట ఇచ్చి మధ్యలో వచ్చేయడం కరెక్ట్ కాదని అనిపించిందని.. దీంతో ఢీ షోను వదులుకున్నట్లు శేఖర్ మాస్టర్ తెలిపాడు. ఇటీవల కొత్త సీజన్ ప్రారంభించిన సందర్భంగా ఢీ షోకు రావాలని ఆహ్వానించారని.. వెళ్తే వెళ్తానేమో కానీ ఇప్పటికైతే తనకు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. కాగా ఢీ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని విజేతగా నిలిచిన శేఖర్ మాస్టర్ మొదట సుధీర్ బాబు సినిమా ఎస్ఎంఎస్ సినిమాలో అవకాశం సంపాదించుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ జులాయి వంటి సినిమాకు ఆఫర్ రావడంతో కెరీర్‌లో దూసుకెళ్లాడు. తాను పార్టిసిపెంట్‌గా వచ్చిన షోకు జడ్జిగా మళ్ళీ వచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్, సిరి కాంబినేషన్‌లో వెబ్ సిరీస్‌ను నిర్మాతగా శేఖర్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…