
గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారిన టాపిక్స్ లో ఒకటి నరేష్ నాల్గవ పెళ్లి వ్యవహారం..ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో నరేష్ చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నాడు..పవిత్ర లోకేష్ కూడా తన భర్త మరియు పిల్లకు దూరంగా నరేష్ తోనే సహజీవనం చేస్తూ కాలం గడుపుతున్నారు..నిన్న మొన్నటి వరుకు కేవలం మేము స్నేహితులమే అని చెప్పుకొని తిరిగిన ఈ ఇద్దరు ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని అనుకోని సంఘటన వల్ల మేము లివింగ్ రేలషన్ షిప్ లో ఉన్నాం అని..కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పి అందరిని షాక్ కి గురి చేసారు..ఇక నరేష్ మూడవ భార్య రమ్య అయితే నేను నరేష్ కి విడాకులు ఇచ్చే సమస్యే లేదని..నేను ఉండగా నరేష్ ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడో చూద్దాం అంటూ ఆమె మీడియా ముందుకి వచ్చి చేసిన రచ్చ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..ఇటీవలే కర్ణాటక లోని ఒక హోటల్ లో నివాసం ఉంటున్న నరేష్ – పవిత్ర రూమ్ కి వెళ్లి రమ్య చెప్పుతో కొట్టాలని చేసిన ప్రయత్నం ఎంత సెన్సేషన్ అయ్యిందో మన అందరికి తెలిసిన విషయమే.
ఇదంతా కాసేపు పక్కన పెడుదాం..అయితే ఇప్పుడు నరేష్ – పవిత్ర రిలేషన్ గురించి సోషల్ మీడియా లో బయటపడిన ఒక సంఘటన చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని మనం ఆశ్చర్యపోక తప్పదు..అసలు విషయానికి వస్తే నరేష్ – పవిత్రాలది మాములు రిలేషన్ షిప్ కాదు..అగ్రిమెంట్ రేలషన్ షిప్..వీళ్లిద్దరి అగ్రిమెంట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..ఇంతకీ ఆ అగ్రిమెంట్ లో ఉన్న అంశాలు ఏమిటి అంటే , నరేష్ తనతో సహా జీవనం చేస్తునంత కాలం పవిత్ర గారికి ప్రతి నెల పాతిక లక్షల రూపాయిలు ఇవ్వాలట..అంతే కాకుండా నరేష్ తనతో సహా జీవనం చేస్తున్న కాలం లో వేరే అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకుంటే 50 కోట్ల రూపాయిలు పవిత్ర గారికి సమర్పించుకోవాలట..బహుశా నరేష్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడం వలనో ఏమో ఆయన మీద నమ్మకం కుదరకపోవడం తో పవిత్ర ఇలా చేసి ఉండొచ్చని సోషల్ మీడియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్ మనకి కొత్త కావొచ్చు..మనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు కూడా..కానీ సెలెబ్రెటీలకు ఇది సర్వసాధారణం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ..గతం లో విడాకులు తీసుకున్న సమంత మరియు నాగ చైతన్యల కుటుంబాల మధ్య కూడా ఇలాంటి ఒప్పందం ఎదో జరిగింది అనే వార్తలు అప్పట్లో వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు అదే తరహా వార్త నరేష్ – పవిత్ర విషయం లో మనం చూస్తున్నాము..పవిత్ర లోకేష్ ఎక్కువ సినిమాలలో నటించకపోయిన ఈ ముఖం చూస్తే అరెరే ఎక్కడో చూసామే అనే భావన ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కలుగుతుంది..గడిచిన కొద్దీ రోజుల నుండి జరుగుతున్న వ్యవహారం లో పవిత్ర కి మంచి హైప్ వచ్చింది..దీనితో ఈమెకి సినిమా ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయట..ఇక నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది..ఈయన లేని సినిమా అంటూ ఉండదు..అంత బిజీ ఆర్టిస్టు ఈయన..ఈయన కాల్ షీట్ ఒక రోజుకి గాను రెండు నుండి మూడు లక్షల రూపాయిలు ఉంటుందట..ఆ రేంజ్ సంపాదిస్తున్న నరేష్ కి పవిత్ర గారికి నెలకు 25 లక్షలు ఇవ్వడం లో పెద్ద సమస్య లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్ల కామెంట్ చేస్తున్నారు.