
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్ కి ఉన్నంత ఊపు మరో స్టార్ హీరో కి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..#RRR సినిమా లో అల్లూరి సీతారామరాజు గా తన అద్భుతమైన నటనతో ప్రపంచం లో ఉన్న ప్రతి సినీ అభిమానిని అలరించాడు..పాన్ ఇండియా హీరో అవుతాడు అనుకుంటే పాన్ వరల్డ్ హీరో అయ్యాడు..ఇది నిజంగా రామ్ చరణ్ తో పాటు అభిమానులు కూడా ఊహించి ఉండరు..ఎవ్వరు ఊహించని రేంజ్ క్రేజ్ వచ్చేసరికి రామ్ చరణ్ తదుపరి సినిమా పై అంచనాలు ఉండడం సహజమే..ఆ అంచనాలకు సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టే..#RRR తర్వాత అలాంటి అద్భుతానికే శ్రీకారం చుట్టాడు నిర్మాత దిల్ రాజు..తన బ్యానర్ లో 50 వ సినిమాగా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..ఇప్పటికే 70 శాతం కి పైగా టాకీ పార్టు ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఎంతో సజావుగా సాగిపోతున్న ఈ సినిమా షూటింగ్ టాలీవుడ్ సమ్మె కారణంగా గత కొంతకాలం నుండి షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు..ఈ గ్యాప్ లో శంకర్ గారు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసం తమిళనాడు కి వెళ్ళిపోయాడు..ఈ గ్యాప్ లో ఈ సినిమా నుండి ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర రెడ్డి సినిమా నుండి తప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యూనివర్సిటీ సెట్ ని హైదరాబాద్ లో శంషాబాద్ లో భారీ ఖర్చు తో నిర్మిస్తున్నాడు దిల్ రాజు..ప్రొడక్షన్ డిజైనర్ అవ్వడం తో ఈ సెట్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు రవీంద్ర రెడ్డి గారే చూసుకుంటున్నారు..అయితే అనుకున్న బడ్జెట్ లో ఈ సెట్ ని నిర్మించలేకపోతున్న కారణంగా రవీంద్ర రెడ్డి తో దిల్ రాజు కి చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడింది అట..దానితో ఆయన సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..సినిమా ప్రారంభమైన తర్వాత ప్రొడక్షన్ డిజైనర్స్ మారడం ఇది రెండో సారి.
వాస్తవానికి ఈ సినిమా ప్రకటించిన రోజే రామకృష్ణ – మౌనికలను ప్రొడక్షన్ డిజైనర్స్ గా తీసుకున్నాడు దిల్ రాజు..గతం లో వీళ్లిద్దరు కలిసి రామ్ చరణ్ హీరో గా నటించిన రంగస్థలం వంటి సెన్సషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్స్ గా పనిచేసారు..ఈ సినిమాలో ప్రొడక్షన్ మొత్తం చూడడానికి ఎంతో అద్భుతంగా మరియు న్యాచురాలిటీ కి దగ్గరగా ఉంటుంది..అందుకే ఈ సినిమాకి కూడా తీసుకున్నాడు దిల్ రాజు..కానీ ఏమి జరిగిందో ఏమి మనకెవ్వరికి తెలియదు కానీ..వీళ్లిద్దరు ఈ సినిమా నుండి వాక్ అవుట్ అయ్యారు..ఆ తర్వాత రవీంద్ర రెడ్డి ని తీసుకొచ్చాడు దిల్ రాజు..ఇప్పుడు ఆయన కూడా వాక్ అవుట్ అవ్వడం తో సినిమా ఔట్పుట్ ఎలా వస్తుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు..దానికి తోడు శంకర్ గారు తనకి అనుకూలంగా ఉండే టెక్నిషియన్స్ తో కాకుండా టాలీవుడ్ కి చెందిన టెక్నిషియన్స్ తో పని చేస్తున్నాడు..అందుకే అభిమానుల్లో కాస్త ఆందోళన ఏర్పడింది..అయితే ఎలాంటి భయం అక్కర్లేదని..సినిమా ఔట్పుట్ అదిరిపోయేలా వస్తుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా ఆ అంచనాలను ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.