
సుమారు 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న నటి జయసుధ గారు..హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా రాణించిన ఈమె..ఆ తర్వాత క్యారక్టయెర్ ఆర్టిస్టుగా కూడా అదే స్థాయి డిమాండ్ తో ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగింది..NTR , ANR , కృష్ణ తరం అలాగే చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ తరం..నేటి తరమైన మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తరం..ఇలా అన్ని జెనెరేషన్స్ లో కూడా మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా జయసుగా గారు కొనసాగారు..దాదాపుగా ప్రతి ఒక్క హీరో సినిమాలో ఆమె నటించారు..కానీ ఇటీవల కాలం లో ఆమెకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి..కరోనా వల్ల లాంగ్ బ్రేక్ రావడంతో చాలా మార్పులు జరిగాయి..ఆ మార్పులలో ఎంతో మంది ఆర్టిస్టుల కెరీర్ ఎండ్ అయిపోయింది..వారిలో జయసుధ గారు కూడా ఒక్కరు..అయితే ఇంతకాలం బిజీ గా ఉండడం వల్ల ఇండస్ట్రీ గురించి ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదు జయసుధ.
కానీ ఒక్కసారిగా అవకాశాలు రావడం తగ్గిపోవడం తో తనలో 5 దశాబ్దాల నుండి దాచుకున్న ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపెట్టింది..ఇటీవలే ఈమె ABN ఛానల్ లో ప్రసారం అయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ RK ‘ ప్రోగ్రాం లో పాల్గొనింది..ఈ ప్రోగ్రాం లో ఆమె టాలీవుడ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..’తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కి ఏ మాత్రం కూడా గౌరవం ఉండదు..అదే ఇతర ఇండస్ట్రీస్ లో హీరోయిన్ కి ఇచ్చే వేల్యూ వేరు..కానీ ఇక్కడ అలా ట్రీట్ చెయ్యరు’ అంటూ చెప్పుకొచ్చారు జయసుధ గారు..అంతే కాకుండా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ మీద కూడా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ప్రస్తుతం మూవీ ఆర్టిస్టు ప్రెసిడెంట్ గా మంచు విష్ణు కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ అసోసియేషన్ లో మంచు విష్ణు పోటీ చేస్తున్నప్పుడు వచ్చి వోట్ వెయ్యమని మోహన్ బాబు అడగగా జయసుధ అందుకు ఒప్పుకోలేదని ..తనకి నేను ఎన్నో సహాయాలు చేశాను..కానీ నాకు మాత్రం ఆమె చిన్న వోట్ సహాయం కూడా చెయ్యలేకపోయింది అంటూ అప్పట్లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ సెన్సషనల్ గా మారింది.
అయితే ఇదే విషయం ని జయసుధ వద్ద ప్రస్తావించగా ఆమె దానికి సమాధానం చెప్తూ ‘నేను ఇప్పుడు కాదండి..ఎప్పుడు కూడా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నినాకాలలో పాల్గొని ఎవరికీ వోట్ వెయ్యలేదు..మోహన్ బాబు గారికి కూడా ఆ విషయం తెలుసు..తెలిసి కూడా ఆయన ఎందుకు అలా కామెంట్ చేసారో అర్థం కావడం లేదు..ఈ అసోసియేషన్ ద్వారా ఎమన్నా లాభం ఉందా..అసోసియేషన్ కోసం తన సొంత ఖర్చు తో పెద్ద భవనం నిర్మిస్తాను అని విష్ణు అన్నాడు..ఎక్కడ నిర్మిస్తున్నాడు..ఆ నిర్మాణం సంగతి పక్కన పెట్టి తన సినిమాల నిర్మాణం కోసం కష్టపడుతున్నాడు..ఇలాంటి ఒక అసోసియేషన్ కోసం ఎక్కడో విదేశాల్లో ఉంటున్న నేను ఇండియా కి ఈ పని కోసంగా రావాలా? అందుకే నేను రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు జయసుధ గారు..జయసుధ గారు చివరి సారిగా వెండితెర మీద కనిపించిన సినిమా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన రూలర్..ఆ సినిమా తర్వాత ఈమె కనుమరుగు అయ్యారు.