
టాలీవుడ్ లో ఇప్పుడు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పట్టుమని వెయ్యి ఓట్లు ఉండే ఈ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కోసం ఇంత హుంగామ అవసరమా అని సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి, కానీ సినిమా వాళ్లకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమే, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వంటి మహానటుడు ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావడం, ఆయనకీ పోటీగా దశాబ్దాల నుండి ఇండస్ట్రీ ని ఏలుతున్న కుటుంబాలలో ఒక్కటి అయినా మంచు ఫామిలీ నుండి మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిలబడడం తో ఈ ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్ గా మారిపోయింది, దానికి తోడు ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు పరస్పరం ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకోవడం, వారి కామెంట్స్ సిసిల మీడియా మొత్తం తెగ వైరల్ అవ్వడం తో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవ్వరు గెలుస్తారు అనేది అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతున్న విషయం,మరి అందరిలో నెలకొన్న ఈ ఉత్కంఠ కి ఈ నెల 10 వ తేదీన జరగబొయ్యే ఎన్నికలతో తెరపడనుంది.
ఇక మా ఎన్నికలలో కొత్తగా లోకల్ మరియు నాన్ లోకల్ సెంటిమెంట్ ని ఏ రేంజ్ లో లేపరో మన అందరికి తెలిసిందే, ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది నటీనటులు కూడా , కోట శ్రీనివాసరావు గారి వంటి లెజండరీ నటులు కూడా ప్రకాష్ రాజ్ మన తెలుగు వాడు కాదు , మన తెలుగు వాడైనా మంచు విష్ణు కో వోట్ వెయ్యండి అంటూ క్యాంపైన్ ప్రారంభించారు ఇక మెగా ఫామిలీ మొదటి నుండి ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలుపుతూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, ఇందులో భాగంగా ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు మంచు విష్ణు కి కౌంటర్ ఇస్తూ విడుదల చేసిన ఒక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘అసలు లోకల్ మరియు నాన్ లోకల్ అనే ఫీలింగ్ రేపడానికి సిగ్గు ఉండాలి, ప్రకాష్ రాజ్ మంచు విష్ణు కంటే అద్భుతంగా తెలుగు మాట్లాడగలడు మరియు రాయగలడు, సినిమాలు ఎవ్వరు చూడని వారిని ప్రకాష్ రాజ్ ని మరియు విష్ణు బాబు ని వాళ్ళ ముందుకి ఉంచితే ప్రకాష్ రాజ్ మాత్రమే స్వచ్ఛమైన తెలుగు వాడు అని అనిపించేలా మాట్లాడగలడు’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రకాష్ రాజ్ కి నిర్మాతలతో కాంట్రవర్సీలు ఉన్నాయి అన్నారు, నీకు ఏ నిర్మాతతో కాంట్రవర్సీ లేదా విష్ణు?, సలీం సినిమాకి మీరు తనకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారు అని ఆ చిత్ర దర్శకుడు వై వీ ఎస్ చౌదరి గారు మీపై కోర్టు లో కేసు వేసిన విషయం వాస్తవం కాదా? , అతను దమ్మునోడు కాబట్టి గొంతు ఎత్తి పోరాడాడు, కానీ మీకు బయపడి ఆలా పోరాడలేక నష్టపోయిన వారు ఎంత మంది ఉన్నారు అని మేము అడిగితె నీకు ఎలా ఉంటుంది?,మీ విషయం లో ఎవరిదీ తప్పు ఉంది అనేది మాకు తెలియదు, ప్రకాష్ రాజ్ విషయం లో ఎవరిదీ తప్పు ఉంది అనేది మీకు తెలియదు,కాబట్టి ఇలాంటి విషయాలు ప్రస్తావనికి తీసుకొని రావడం టైం వేస్ట్ యెవ్వారాలు,రేపు ఇండస్ట్రీ లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి ప్రకాష్ రాజ్ ముందుకి వస్తాడు, అతనికి ఆ సమస్య పై పోరాడి న్యాయం చెయ్యగలిగే సత్తా ఉంది, బుద్ది ఉన్నోడు ఎవడైనా ప్రకాష్ రాజ్ ని కాదు అని నీ దగ్గరకి వస్తాడా పంచాయితీ కోసం’ అంటూ మంచు విష్ణు పై కామెంట్స్ చేసాడు ప్రకాష్ రాజ్.