Home Entertainment మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు

మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
7,281

మంచు మోహన్‌బాబు రెండో తనయుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు-నిర్మల దేవి దంపతులకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అన్న మంచు విష్ణు కంటే మంచు మనోజ్ నటనాపరంగా బెస్ట్ అనే ముద్ర వేయించుకున్నాడు. హిట్లు కూడా అన్నయ్య విష్ణు కంటే మనోజ్ ఖాతాలోనే ఎక్కువ ఉన్నాయి. మనోజ్ బాల్యంలో తన పదో ఏటలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బిందాస్, నేను మీకు తెలుసా, కరెంట్ తీగ, వేదం, ఝుమ్మంది నాదం వంటి చిత్రాలతో మంచు మనోజ్ ఆకట్టుకున్నాడు. బిందాస్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. మంచు మనోజ్ ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అంతేకాదు విష్ణుతో పోలిస్తే సెన్సిబుల్‌గా కూడా కనిపిస్తాడు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. కానీ తన పెళ్లి పెటాకులు కావడంతో సోషల్ మీడియాలో మంచు మనోజ్ ట్రోలింగ్‌కు గురయ్యాడు.

తాజాగా మరోసారి మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2015 మే 20న మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల 2019లో ప్రణతిరెడ్డితో మనోజ్ విడిపోయాడు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆనాటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నాడంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లేనని తేలిపోయాయి. అయితే ప్రణతిరెడ్డిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనోజ్‌తో విడిపోయిన తర్వాత ప్రస్తుతం ప్రణతిరెడ్డి అమెరికాలోనే ఉంటోంది. ఆమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్. తన పనిలో బిజీగా ఉంటూ సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతానికి మోహన్‌బాబు కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది.

మరోవైపు మంచు మనోజ్ ఇటీవల ఏపీలోని టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డితో హైదరాబాద్‌లో ఓ గణేష్ మండపంలో మీడియాకు కనిపించడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ సీతాఫల్ మండిలోని గణేష్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మనోజ్, మౌనికారెడ్డి పాల్గొన్నారు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే టాక్ మొదలైంది. అయితే భూమా మౌనికతో పెళ్లిపై మంచు మనోజ్ నో కామెంట్ అన్నాడు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతానని స్పష్టం చేశాడు. అయితే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును మోహన్‌బాబు కలిశాడు. ఈ ఘటన జరిగిన నెలరోజుల తర్వాత టీడీపీ నాయకురాలితో మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్‌కు పెళ్లి కుదిరేలా కనిపిస్తోంది. అంటే ఇటీవల చంద్రబాబును మోహన్ బాబు కలిసింది ఈ పెళ్లి గురించి మాట్లాడేందుకేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మీ అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నాడు. కాగా భూమా మౌనికారెడ్డికి కూడా మొదట బెంగుళూరుకు చెందిన గణేష్‌రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. రెండేళ్ల క్రితమే మౌనికారెడ్డి గణేష్‌రెడ్డితో విడాకులు తీసుకున్నారు. అనంతరం మౌనికారెడ్డి హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లుగా తెలుస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…