Home Entertainment భీమ్లా నాయక్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

భీమ్లా నాయక్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
2,248

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన మూవీ భీమ్లా నాయక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అందించాడు. ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే భారీ హైప్ నెలకొంది. దీంతో విదేశాల్లో ప్రీమియర్లు మొదలుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్లలో హ్యుజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కింది. అయితే ఈ సినిమా తొలుత పవన్ కళ్యాణ్, రానాల దగ్గరకు వెళ్లలేదు. ముందుగా మాస్ హీరో బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాను చేయాల్సి ఉంది. అయితే వాళ్లిద్దరూ వేరే ప్రాజెక్టుల్లో బిజీ కావడం వల్ల ఈ మూవీని చేయలేకపోయారు.

బాలయ్య, రవితేజ కాంబో సెట్ కాకపోవడంతో కనీసం విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కించాలని ప్రయత్నించారు. అది కూడా కుదరలేదు. కొన్నిరోజుల తర్వాత సూర్యదేవర నాగవంశీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు త్రివిక్రమ్ చేతుల్లోకి వెళ్లగా ఆయన సాగర్ కె. చంద్రను దర్శకుడిగా సెట్ చేశాడు. అలా పవన్ కళ్యాణ్, రానాలు హీరోలుగా భీమ్లానాయక్ అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. అహానికి, ఆత్మగౌరవానికి జరిగే ఘర్షణే ఈ సినిమా కథ. పవన్ కళ్యాణ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కాగా.. రానా డబ్బు, పలుకుబడి ఉన్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. డ్యూటీలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు రానా మందు బాటిల్స్‌తో సహా దొరికిపోతాడు. ఈ ప్రయత్నంలో పోలీసులపై తిరగబడతాడు. దీంతో రానాపై పవన్ కళ్యాణ్ చేయిచేసుకుని జీపు ఎక్కిస్తాడు. ఈ క్రమంలో రానా కట్టుకున్న పంచె ఊడిపోతున్నాసరే వదలకుండా బలవంతంగా జీపు ఎక్కించి పవన్ కళ్యాణ్ స్టేషన్‌కు తీసుకుని వెళ్తాడు. అక్కడే రానా అహం దెబ్బతిని పవన్‌పై కక్షపెంచుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటించారు. తమన్ అందించిన ఈ మ్యూజిక్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌ మాస్‌ ప్రేక్షకులకు ఊపు తెచ్చింది. కాగా భీమ్లానాయక్ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది. ఈ సినిమా తాజాగా టీవీలో ప్రసారం అయ్యింది. ఈ చిత్రం ఫస్ట్ టైమ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ కాగా షాకింగ్ టీఆర్పీ అందుకుంది. ఈ చిత్రం స్టార్ మాలో మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యింది. అయితే కేవలం 9.1 టీఆర్పీ రేటింగ్ మాత్రమే అందుకుని షాక్ ఇచ్చింది. భారీ సినిమా, పవన్ ఇమేజ్ ఉండి కూడా ఈ రేంజ్‌లో టీఆర్పీ రావడం చాలా తక్కువే అని అభిమానులు భావిస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…