Home Entertainment భీమ్లా నాయక్ రికార్డ్స్ ని టచ్ చేయలేకపోయినా మహేష్ సర్కారు వారి పాట సినిమా

భీమ్లా నాయక్ రికార్డ్స్ ని టచ్ చేయలేకపోయినా మహేష్ సర్కారు వారి పాట సినిమా

0 second read
0
1
7,322

అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట చిత్రం ఈ నెల 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు నుండి వస్తున్నా సినిమా కావడం తో కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది..దానికి తోడు మహేష్ బాబు నుండి చాలా కాలం తర్వాత వస్తున్నా ఒక్క పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ కావడం తో అభిమానులు ఈ సినిమా కచ్చితంగా దూకుడు స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని భావిస్తున్నారు..దానికి తోడు సాంగ్స్ మరియు ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఈ మూవీ ఓపెనింగ్స్ లో కూడా దుమ్ము లేపేస్తుంది అని అందరూ భావించారు..ఇటీవలే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి..కానీ షాక్ కి గురి చేసే విషయం ఏమిటి అంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్ లో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆశించిన స్థాయిలో లేదు అనే చెప్పాలి.

ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆంధ్ర ప్రదేశ్ లో అతి తక్కువ టికెట్ రేట్ తో విడుదల అయినా ఈ సినిమా వంద కోట్ల రూపాయిల మార్కుని అందుకోవడమే కాకుండా..ఈ సినిమా సృష్టించిన కొన్ని అద్భుతమైన రికార్డ్స్ ని ఇప్పటికి మన టాలీవుడ్ హీరోలెవ్వరూ కూడా అందుకోలేకపోతున్నారు..ముఖ్యంగా నైజం ప్రాంతం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ప్రాంతం లో భీమ్లా నాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఒక్క రేంజ్ స్పీడ్ ని చూపించింది..మొదటి రోజు నైజం ప్రాంతీ ప్రాంతం లో భారీ మార్జిన్ తో ఆల్ టైం రికార్డ్స్ కొట్టి పవర్ స్టార్ స్టామినా ఎలాంటిదో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..మొదటి రోజు ఈ సినిమా నైజం ప్రాంతం లో దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఇప్పుడు ఈ రికార్డు ని మహేష్ సర్కారు వారి పాట సినిమా కొడుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది..ఎందుకంటే నైజం ప్రాంతంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు..సిటీ లో పర్వాలేదు అని అనిపించినప్పటికీ నైజం రీరల్ ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ సినిమా నైజం ప్రాంతం మొదటి రోజు వసూళ్లు భీమ్లా నాయక్ రికార్డు ని కొట్టడం కష్టం లాగ అనిపిస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక మహేష్ బాబు కంచుకోట అయినా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్రీ సేల్స్ ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం..ఎందుకంటే మహేష్ బాబు కి ఇక్కడ డిజాస్టర్ సినిమాలు సైతం అద్భుతమైన కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ఉంటాయి..కానీ సర్కారు వారి పాట సినిమాకి అమెరికా , ఆస్ట్రేలియా మరియు UK వంటి ప్రాంతాలలో అతి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి..పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా అమెరికా లో కేవలం ప్రీమియర్స్ నుండే 9 లక్షల డాలర్లు వసూలు చేస్తే , సర్కారు వారి పాట సినిమా 8 లక్షల డాలర్లు కూడా వసూలు చేసే అవకాశం కనిపించడం లేదు..సినిమాకి సంపూర్ణమైన పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ ఇంత తక్కువ ట్రెండ్ జరగడం మహేష్ బాబు కి ఇదే తొలిసారి అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేకపోయినా టాక్ వస్తే మాత్రం కచ్చితంగా అద్భుతమైన వసూళ్లు ఉంటాయి అని అభిమానులు ఆశిస్తున్నారు..చూడాలి మరి వారి ఆశలను ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…