
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది..ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ లో ఎదురు అయినా అడ్డంకులు మన అందరికి తెలిసిందే..అతి తక్కువ టికెట్ రేట్స్..బెన్ఫిట్ షోస్ ఇవేమి లేకపోయినా కూడా మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా 26 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..దీని తర్వాత వచ్చిన ఆచార్య , రాధే శ్యామ్ మరియు సర్కారు వారి పాట వంటి సినిమాలు భీమ్లా నాయక్ వర్త్ షేర్ ని కొట్టడం లో విఫలం అయ్యాయి..ఇక నైజం ప్రాంతం లో భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ ప్రభంజనం గురించి మాట్లాడుకోవాల్సిందే..295 టిక్కెట్ రేట్స్ తో విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు ఈ ప్రాంతం లో దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది.
ఈ రికార్డు ని మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కొట్టేస్తుంది అని అందరూ అనుకున్నారు..పైగా ఈ సినిమాకి టికెట్ రేట్స్ 350 రూపాయిలు..దానికి తోడు హైదరాబాద్ లో ప్లెక్సస్ షోస్ 1300 పైగా వేశారు..భీమ్లా నాయక్ కి పడింది కేవలం 800 షోలు మాత్రమే..ఎటు చూసుకున్న భీమ్లా నాయక్ రికార్డు ని భారీ మార్జిన్ తో కొట్టాలి ఊపు లో వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా భీమ్లా రికార్డు ని కొట్టడం లో విఫలం అయ్యింది..దీనికి ముందు వచ్చిన రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలు కూడా భీమ్లా నైజం మొదటి రోజు రికార్డు ని కొట్టడం లో దారుణంగా ఫెయిల్ అయ్యాయి..ఇక భారీ అంచనాలతో విడుదల అయినా KGF చాప్టర్ 2 కూడా భీమ్లా నాయక్ మొదటి రోజు వసూళ్లను అందుకోలేకపోయింది..ఇలా భారీ రేట్స్ తో భారీ షోస్ తో వచ్చినప్పటికీ కూడా భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ రికార్డ్స్ ని అందుకోలేకపోయారు అంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
మొదటి రోజు ఓపెనింగ్స్ సంగతి పక్కన పెడితే..రెండవ రోజు మరియు మూడవ రోజు కలెక్షన్స్ లో కూడా భీమ్లా నాయక్ సృష్టించిన రికార్డ్స్ ని అందుకోలేకపోయ్యాయి లేటెస్ట్ సినిమాలు..ఉదాహరణకి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ని తీసుకుంటే మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమా నైజం ప్రాంతం లో ఒక్క సెంటర్ లో కూడా భీమ్లా నాయక్ రికార్డు ని ముట్టుకోలేకపోవడం కాదు కదా..కనీసం దానిలో సగం కూడా వసూలు చెయ్యలేకపోయింది..ఆంద్ర్ ఆప్రదేశ్ లో కూడా చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి..ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లో భీమ్లా నాయక్ తొలి మూడు రోజులు వసూళ్లను అందుకోవడం ఘోరంగా విఫలం అయ్యింది సర్కారు వారి పాట చిత్రం..ఇక ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి..ఇక్కడ భీమ్లా నాయక్ సినిమా మొదటి వారం 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది..సర్కారు వారి పాట సినిమాకి భీమ్లా నాయక్ కంటే మూడు రేట్లు షోస్ ఎక్కువ..అయినా కూడా ఆ రికార్డు ని కొట్టే ఛాన్స్ ప్రస్తుతానికి కనపడడం లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా..అలా మన టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలు విడుదల అయ్యినప్పటికీ భీమ్లా నాయక్ రికార్డ్స్ ని అందుకోవడం లో ఘోరంగా విఫలం అయ్యారు అనే చెప్పాలి.