Home Entertainment భీమ్లా నాయక్ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

భీమ్లా నాయక్ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
2,236

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆంధ్ర ప్రదేశ్ లో అతి తక్కువ టికెట్ రేట్స్ మీద వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాని కొన్న ప్రతి ఒక్క బయ్యర్ కి కేవలం వారం లోపే లాభాల వర్షం కురిపించింది అంటే పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు,ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది, పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తర్వాత ఓవర్సీస్ లో క్లీన్ హిట్ గా నిలిచినా సినిమా ఏదైనా ఉందా అంటే అది భీమ్లా నాయక్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు , ఇక ఇతర రాష్ట్రాలు అయినా చెన్నై బెంగళూరు వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి బయ్యర్లకు లాభాల వర్షం కురిపించింది, ఈ స్థాయి బాక్స్ ఆఫీస్ రన్ ని దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు క్లోసింగ్ కి వచ్చేసింది, ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేసింది , ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ మరియు బెన్ఫిట్ షోస్ లేకపోడం వల్ల ఈ సినిమా ఎంత నష్టపోయింది అనే దానిపై ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కి కలిపి ఈ సినిమా దాదాపుగా 26 కోట్ల రూపాయలకు పైగానే రాబట్టింది, తెలంగాణ లో ఏ సినిమాకి మొదటి రోజు 12 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది, ఇది అక్కడ ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు,కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఈ సినిమాకి కేవలం 14 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది, పవర్ స్టార్ రేంజ్ కి ఈ వసూళ్లు ఆంధ్ర ప్రదేశ్ లో చాలా తక్కువ అనే చెప్పాలి, దానికి ముఖ్య కారణం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన జీవో 35 టికెట్ రేట్స్ అని చెప్పొచ్చు, ఈ టికెట్ రేట్స్ మీద అంత వసూళ్లు వచ్చాయి అంటే నిజంగా పవర్ స్టార్ స్టామినా కి దండం పెట్టొచ్చు,రాధే శ్యామ్ సినిమాకి ఉన్న టికెట్ రేట్స్ భీమ్లా నాయక్ కి ఉంది ఉంటె కచ్చితంగా బాహుబలి 2 42 కోట్ల షేర్ రికార్డు ని కొట్టేది అని ట్రేడ్ వర్గాల అంచనా, అంటే ఒక్క రోజులో ఈ సినిమా కి దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగానే షేర్ కి బొక్క పడింది అని అంచనా వేస్తున్నారు , అన్ని కలిసి వచ్చి ఉంటె ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల షేర్ కొట్టి ఉండేది అని ట్రేడ్ వర్గాల అంచనా.

కానీ ఈ రేట్స్ మీద 100 కోట్ల రూపాయిలు ఫుల్ రన్ లో కొట్టడం దాదాపుగా అసాధ్యం అని అందరూ అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మొదటి వారం లోనే 97 కోట్ల రుపాయిల షేర్ ని కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసాడు, ఇక ఫుల్ రన్ వచ్చే లోపు ఈ సినిమా ప్రపాంచవ్యాప్తంగా దాదాపుగా 105 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని, ఈ సినిమాకి మాములు రేట్స్ ఉంది ఉంటె కచ్చితంగా 140 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకొని ఉండేది అని ట్రేడ్ వర్గాల అంచనా,కక్ష రాజకీయాల వల్ల దాదాపుగా ఈ సినిమాకి అదనంగా వచ్చే 40 కోట్ల రూపాయిల షేర్ కి బొక్క పడింది అని ఈ సినిమా బయ్యర్స్ వాపోతున్నారు, ఇన్ని రోజులు వెండితెర మీద అలరించిన ఈ సినిమా ఈ నెల 25 వ తారీకు నుండి ఆహా మరియు హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది, థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ఏ స్థాయి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…