
గడ్డు కాలం ఎదురుకుంటున్న తెలుగు సినీ పరిశ్రమ ని ఈరోజు విడుదలైన రెండు సినిమాలు ఊపిరి పోశాయి..కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన భింబి సారా..అలాగే మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరో గా తెలుగు లో డైరెక్టుగా నటించిన సీతారామం చిత్రాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి..OTT వల్ల థియేటర్స్ కి జనాలు రావడం లేదు అనే ఇండస్ట్రీ పెద్దల వాదనని ఈ రెండు సినిమాలు తప్పు అని నిరూపించాయి..కళ్యాణ్ రామ్ అంటే నందమూరి హీరో..టాక్ వస్తే ఆయనకీ కలెక్షన్స్ రావడం సర్వసాధారణం..కానీ ఒక మలయాళం హీరో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ అదిరిపోవడం అనేది మాములు విషయం అయితే కాదు..దుల్కర్ సల్మాన్ మలయాళం లో స్టార్ హీరో కానీ..తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు కూడా సగం మందికి తెలియదు..అలాంటి హీరో సినిమాకి కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి అంటే ఏమిటి అర్థం??..సరైన కంటెంట్ సినిమా వదిలితే కచ్చితంగా థియేటర్స్ కి వచ్చి చూస్తాము అని ప్రేక్షకులు ఇచ్చిన సందేశమే కదా ఇది.
కాబట్టి ఇండస్ట్రీ కి ఎదో జరిగిపోయింది అని సినిమాల షూటింగ్స్ ఆపడం కాదు..మంచి కంటెంట్స్ ని ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యండి..కచ్చితంగా మేము ప్రోత్సహిస్తాము అంటూ ఆడియన్స్ చెప్పకనే చెప్తున్నారు..ఇక ఈరోజు విడుదలైన రెండు సినిమాల వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అనే చెప్పాలి..రెండు సినిమాల ఓపెనింగ్స్ అదిరిపోయాయి..సీత రామం సినిమాకి A సెంటర్స్ లో బంపర్ ఓపెనింగ్ వచ్చింది..ఇక కళ్యాణ్ రామ్ భింబిసారా సినిమాకి మాత్రం A నుండి C సెంటర్స్ వరుకు అదిరిపొయ్యే ఓపెనింగ్స్ వచ్చాయి..కానీ ఓవర్సీస్ లో మాత్రం సీత రామం సినిమాదే పై చెయ్యి లాగ అనిపిస్తుంది..భింబిసారా సినిమాకంటే ఎక్కువ లొకేషన్స్ లో విడుదల అవ్వడం వల్లే అక్కడ సీతారామం సినిమా లీడ్ తీసుకుంది అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట..కానీ ఓవరాల్ గా మాత్రం భింబిసారా సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయని టార్డ్ సర్కిల్స్ లో వినిపించే వార్త.
భింబిసారా సినిమాకి మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల నుండి మొదటి రోజు 6 నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..ముఖ్యంగా నైజం , సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఈ సినిమా ఓపెనింగ్స్ ప్రభంజనం సృష్టించింది..కేవలం ఈ మూడు ప్రాంతాల నుండి 5 కోట్ల రూపాయిల వరుకు షేర్ ని రాబడుతుంది అని అంచనా..ఇక సీత రామం సినిమా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి..ముఖ్యంగా ఈ సినిమాకి నైజం ప్రాంతం లో అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది..ఈ ప్రాంతం లో ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మేజర్ సిటీస్ లో అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది..మొత్తం మీద రెండు ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 3 నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇక ఫుల్ రన్ లో ఈ రెండు సినిమాలలో ఎవరిదీ పై చెయ్యి సాధిస్తుందో చూడాలి.