Home Entertainment భింబిసారా మొదటి రోజు వసూళ్లు చూస్తే మెంటలెక్కిపోతారు

భింబిసారా మొదటి రోజు వసూళ్లు చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
0
267

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది..ఎందుకంటే గడిచిన కొద్దీ నెలల నుండి ఇండస్ట్రీ వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో తీవ్రమైన సంక్షోభం ని ఎదురుకుంటూ ఉంది..వచ్చిన ప్రతి సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ నిర్మాతలను భయాందోళనకు గురి చేసింది..ఇండస్ట్రీ కి ఎదో అయ్యింది..ఆడియన్స్ సినిమాలకు రావడం మానేశారు అంటూ నిర్మాతలు పునరాలోచించుకోడానికి సినిమా షూటింగ్స్ అన్ని కూడా ఆపేసి ప్రత్యేకమైన కమిటీలు వేశారు..ప్రేక్షకులు OTT కి అలవాటు పడిపోయారు ఇక థియేటర్స్ రారు అని అనుకుంటున్న సమయం లో ఈరోజు విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అదిరిపొయ్యే ఓపెనింగ్స్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెచ్చిపెట్టింది..ఎంతో కాలం తర్వాత ప్రతి చోట థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ కనపడడం చూసి థియేటర్స్ యాజమాన్యాలు ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు..బయ్యర్లు చాలా కాలం తర్వాత సక్సెస్ పార్టీలు చేసుకున్నారు..ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అదిరిపొయ్యే ఓపెనింగ్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ప్రాంతాల వారీగా మొదటి రోజు వసూళ్లు ఎంత వసూలు చేసింది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

విడుదలకి ముందు నుండే భింబిసారా అదిరిపొయ్యే టీజర్ మరియు ట్రైలర్ కట్ తో ప్రేక్షకులను మరియు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది..అంచనాలు భారీగా పెంచింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నుండే సూపర్ ట్రెండ్ ని కనబర్చింది ఈ చిత్రం..ఇక విడుదల తర్వాత మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోగా..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ఇండస్ట్రీ కి మళ్ళీ మంచి రోజులను తీసుకొచ్చింది..ముఖ్యంగా ఈవెనింగ్ షోస్ మరియు సెకండ్ షోస్ కలెక్షన్స్ అయితే న భూతొ న భవిష్యతి అనే రేంజ్ లో ఉన్నాయి..నైజం ప్రాంతం నందమూరి కుటుంబానికి వీక్ జోన్ అని అందరూ అంటూ ఉంటారు..కానీ భింబిసారా మొదటి రోజు వసూళ్లు చూస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే..కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే ఈ సినిమా 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేస్తుందని అంచనా..ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూలు చేసిన కలెక్షన్స్ ని భింబిసారా కేవలం నైజం ప్రాంతం నుండే వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు.

ఇక నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటిది సీడెడ్ ప్రాంతం..ఇక్కడ భింబిసారా కి పాజిటివ్ టాక్ రాగానే కలెక్షన్ల ఊచకోత ప్రారంభం అయ్యింది..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్స్ కళకళలాడిపొయ్యాయి..మొదటి రోజు ఈ ప్రాంతం లో ఇక్కడ ఈ సినిమాకి దాదాపుగా కోటి రూపాయిల షేర్ వస్తుందని అంచనా..ఇక వైజాగ్, నెల్లూరు , కృష్ణ మరియు గుంటూరు వంటి ప్రాంతాలలో ఈ సినిమా వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్..టాలీవుడ్ ఇలాంటి షేర్స్ ని చూసి చాలా కాలమే అయ్యింది అని చెప్పొచ్చు..ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ అదిరిపోయాయి..ఇదే ఊపు ని వీక్ డేస్ లో కూడా కొనసాగిస్తే ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా..చూద్దాం మరి ఈ సినిమా ఆ రేంజ్ ని అందుకుంటుందా లేదా అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…