Home Entertainment భింబిసారా మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

భింబిసారా మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
419

ఈ ఏడాది టాలీవుడ్ పూర్తిగా స్లంప్ లో ఉన్న సమయం లో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాలలో ఒకటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన భింబిసారా చిత్రం..విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా విడుదల తర్వాత మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే అంచనాలకు మించి వసూళ్లను రాబడుతూ దూసుకుపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..కేవలం 17 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి నాల్గవ రోజు నుండి లాభాల్లోకి అడుగుపెట్టింది..అలా ఈ సినిమా వసూళ్లు మొత్తానికి ఇప్పుడు క్లోసింగ్ రేంజ్ కి వచ్చేసింది..దాదాపుగా అన్ని ప్రాంతాలలో నెట్ ఫ్రీ డిక్లేర్ చేసేసారు దర్శక నిర్మాతలు..ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ఏ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మొదటి రోజు దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే బ్రేక ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది..అలా కేవలం మూడు రోజుల్లోనే 18 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏకంగా 40 కోట్ల రూపాయిల మార్కుని అందుకొని సంచలనం సృష్టించింది..కళ్యాణ్ రామ్ కి ఈ సినిమాకి ముందు సరైన బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి లేదు..ఆయన హీరో నటించిన పటాస్ సినిమానే ఆఖరి సూపర్ హిట్ సినిమా..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి..అలా పూర్తిగా మార్కెట్ ని పోగొట్టుకున్న కళ్యాణ్ రామ్ నేడు ఏకంగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకోవడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..నిన్న మొన్నటి వరుకు కూడా ఈ సినిమా వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడించింది అంటే మాములు విషయం కాదు.

మరో విశేషం ఏమిటి అంటే ఈ సినిమా ఒక్క నైజం ప్రాంతం లోనే 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఈ సినిమా రైట్స్ ని ఇక్కడ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా పెట్టిన ప్రతి పైసాకి రెండింతల లాభాల్ని ఆర్జించింది..కళ్యాణ్ రామ్ గత చిత్రాలు వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ కూడా భింబిసారా నైజాం ప్రాంతం క్లోసింగ్ అంత ఉండదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది..కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ కూడా తెరకెక్కబోతుంది..ఈ సీక్వెల్ ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి..టాలీవుడ్ కి సూరిడర్ రెడ్డి మరియు అనిల్ రావిపూడి వంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసిన కళ్యాణ్ రామ్, ఇప్పుడు భింబిసారా చిత్రం ద్వారా వసిష్ఠ అనే డైరెక్టర్ ని కూడా పరిచయం చేసాడు..ఈయన కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…