Home Entertainment భింబిసారా బాక్స్ ఆఫీస్ విద్వాంశం..3 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా?

భింబిసారా బాక్స్ ఆఫీస్ విద్వాంశం..3 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా?

1 second read
0
0
328

గత ఏడాది నుండి నేటి వరుకు మనం గట్టిగ గమనిస్తే నందమూరి ఫామిలీ హీరోలకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది అనే విషయం అర్థం అవుతుంది..డిసెంబర్ నెలలో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా రారా అని అనుకుంటున్న సమయం లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించి అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించి టాలీవుడ్ కి గోల్డెన్ పీరియడ్ ని తీసుకొచ్చింది..ఈ సినిమా తరువాత వచ్చిన సినిమాలన్నీ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ #RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచుకున్నాడో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత వచ్చిన మీడియం బడ్జెట్ సినెమాలో మేజర్ సినిమా మినహా..ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..తమిళ డబ్బింగ్ సినిమా విక్రమ్..కన్నడ డబ్బింగ్ సినిమా విక్రాంత్ రోనా వంటి చిత్రాలు సంచలన విజయాలుగా నిలిచాయి కానీ తెలుగు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.

మరీ దారుణంగా ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలైతే సింగల్ డిజిట్ క్లోసింగ్ నంబర్స్ కి పరిమితం అయ్యి నిర్మాతలను చాలా కంగారు పెట్టింది..ఆడియన్స్ OTT కి అలవాటు పడి థియేటర్స్ కి రావడం మానేశారు..మనం ఖర్చు చాలా తగ్గించాలి అంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నిర్ణయానికి వచ్చి టాలీవుడ్ టాప్ నిర్మాతలను అందరిని పిలిపించి షూటింగ్స్ మానుకునేలా చేసారు..కానీ ఆడియన్స్ కంటెంట్ బాగుంటే కచ్చితంగా ప్రోత్సహిస్తారు అని ప్రెస్ మీట్ లో చెప్పి బింబిసారా సినిమాని ధైర్యం గా విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కొట్టి ఆడియన్స్ ని మరోసారి థియేటర్స్ వైపు బారులు తీసేలా చేసాడు కళ్యాణ్ రామ్..నిన్న ఆయన హీరో గా నటించిన భింబిసారా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బంపర్ ఓపెనింగ్ ని సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కేవలం 17 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..థాంక్యూ సినిమాతో ఘోరమైన నష్టాలను చూసిన దిల్ రాజు కి భింబిసారా సినిమా ఒక జాక్పాట్ లాగ తగిలింది అనే చెప్పాలి..మొదటి రోజే పెట్టిన డబ్బులలో దాదాపుగా 50 శాతం రికవరీ వచ్చింది..ఇక ఈ సినిమాకి ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తూ ఉంటె వీకెండ్ లోపే 17 కోట్ల రూపాయిలు వసూలు చేసి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..పాపం కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం దాదాపుగా 45 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టాడు..కమిషన్ బేసిస్ మీద దిల్ రాజు కి 17 కోట్ల రూపాయలకు అమ్మాడు..అంటే ఇప్పుడు వచ్చే వసూళ్ళలో దిల్ రాజు కి 50 శాతం వెళ్తే..కళ్యాణ్ రామ్ కి 50 శాతం వెళ్తుంది అన్నమాట..ఆలా ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తే..కళ్యాణ్ రామ్ జాక్పాట్ కొట్టినట్టే..దిల్ రాజు కూడా అద్భుతమైన లాభాలు వచ్చినట్టు అవ్వుద్ది..చూడాలి మరి ఈ సినిమా ఆ రేంజ్ లో వసూళ్లను రాబడుతుందో లేదో అనేది..ప్రస్తుతం ఉన్న ఫ్లో చూస్తుంటే కచ్చితంగా ఆ స్థాయి వసూళ్లు వాచేలాగానే కనిపిస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…