
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా 2012 వ సంవత్సరం లో హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది..అభిమానులు చిరకాలం గర్వం తో కాలర్ ఎగరేసుకునే సినిమా ఇచ్చాడు హరీష్ శంకర్..ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా రాబోతుంది..మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద అటు అభిమానుల్లో మాత్రమే కాకుండా ఇటు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ..అతి త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారిపోయింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక కాలేజీ కి ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారు అట..బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ని చూసి పిచ్చెక్కిపోని అభిమాని అంటూ ఎవ్వరు ఉండరు అని చెప్పొచ్చు..భవదీయుడు లో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ బద్రి సినిమాకి పది రేట్లు పవర్ ఫుల్ గా ఉండేట్టు తీర్చి దిద్దాడట హరీష్ శంకర్..పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు అద్భుతమైన మెసేజ్ ని కూడా ఈ సినిమాలో ఉండేట్టు చాలా చక్కగా కనెక్ట్ చేసాడట హరీష్ శంకర్..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ స్టైలింగ్ మరియు మ్యానెరిజం ని కూడా సరికొత్తగా తీర్చిదిద్దినట్టు సమాచారం..తెలుగు , హిందీ , కన్నడ మరియు మలయాళం బాషలలో కూడా ఈ సినిమా ఏకకాలం లో నిర్మాణం జరుపుకోనుంది అట..అంతే కాకుండా బాలీవుడ్ కి సంబంధించిన ఒక్క అగ్ర హీరో ఈ సినిమాలో ఒక్క ముఖ్యపాత్ర పోషించబోతున్నట్టు సమాచారం..గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ఆ పాత్రని సల్మాన్ ఖాన్ చేస్తాడు అని ప్రచారం సాగింది..అయితే అందులో ఎలాంటి నిజం లేదు ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ చెప్పడం తో ఈ రూమర్స్ కి చెక్ పడింది.
ఇక ఈ సినిమాలో ప్రముఖ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన నటించబోతుంది..వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సింది..కానీ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం..దానికి తోడు రాజకీయ వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా గడపడం తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది..అయితే పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 వ తారీఖున నుండి విజయ దశమి పర్వదినం ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటనలు చెయ్యనున్నారు..సుమారు ఒక్క ఏడాది పాటు ఈ యాత్ర కొనసాగనుంది..అందువల్ల పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న హరిహర వీర మల్లు మరియు వినోదయ్య సీతం రీమేక్ సినిమాలను మాత్రమే పూర్తి చెయ్యగలడు..దీనితో ఈ సినిమా 2024 వ సంవత్సరం తర్వాతే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలలో దీనికోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.