
తెలుగు చలన చిత్ర పరిసమాలో యూత్ నుండి ఫామిలీ ఆడియన్స్ వరుకు ప్రతి ఒక్కరిని తన అందం మరియు అభినయం తో మెప్పించిన అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రంభ గారు..మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్లు ఇండస్ట్రీ లో నెగ్గుకురాలేకున్నారు అనే కామెంట్స్ ని తప్పు అని రుజువు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి ఆమె..విజయవాడ ప్రాంతానికి చెందిన రంభ అసలు పేరు విజయ లక్ష్మి..సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు రంభ గా మార్చుకుంది..ప్రముఖ దర్శకుడు EVV సత్యనారాయణ మరియు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది..తొలి సినిమానే సెన్సషనల్ హిట్ అవ్వడం తో రంభ కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్ల వెల్లువ కురిసింది..అతి తక్కువ సమయం లోనే చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.
అలా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు..కోలీవుడ్ , మాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోయిన్ గా చలామణి అయ్యింది రంభ..ఇక ఈ జనరేషన్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ వంటి హీరోలతో యమదొంగ మరియు దేశముదురు వంటి సినిమాలలో ప్రత్యేకమైన పాటలలో ఆడిపాడింది..ఎన్టీఆర్ తో ఆమె చేసిన నాచోరే నాచోరే పాట అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆమె ఇంద్రన్ పద్మనాథన్ అనే అతనిని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది..ఈ ఇద్దరు దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు..అయితే అప్పట్లో ఈమె తన భర్త తో ఏర్పడిన కొన్ని గొడవలను మనసుకు బాగా తీసుకొని కోర్టుకు వెళ్లి విడాకులకు దరకాస్తు చేసుకుంది..అప్పట్లో ఈ వార్త ఒక సంచలనం అనే చెప్పొచ్చు..విడాకుల దర్సఖాస్తు లో భరణం క్రింద ప్రతి నెల 5 లక్షల రూపాయిలు ఇంద్రన్ ఇవ్వాలని..అంతే కాకుండా ముగ్గురు పిల్లలను పోషించే బాధ్యత కూడా రావడం తో కచ్చితంగా ఆస్తులు కూడా ఇవ్వాలంటూ రంభ పిటిషన్ పెట్టింది.
ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అవ్వడం తో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారి చెవిన ఈ వార్త పడింది..వెంటనే ఆయన రంభ కి ఫోన్ చేసి క్లాస్ పీకాడు..అసలు ఏమి జరిగింది..ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు..అని ఆరాలు తీసి ‘ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుంటావా..భార్య భర్తల మధ్య ఇలాంటి మనస్పర్థలు సర్వసాధారణం..సర్దుకుంటూ ముందుకు పోవాలి..అదే దాంపత్య జీవితం అంటే..గొడవలకు విడాకులు అసలు పరిష్కారమే కాదు..నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు..చూసుకో’ అంటూ రంభ ని మందలించారట..దానితో ఆమె విడాకులు వెనక్కి తీసుకుంది..ఇక అప్పటి నుండి ఇప్పటి వరుకు తన భర్త పిల్లలతో ఎంతో సంతోషం గా జీవితం గడుపుతుంది రంభ..చాలా కాలం తర్వాత రంభ గారి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఈ ఫోటోలలో రంభ ని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.