
ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినా విడాకులు అనేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపకుండా విడిపోయి జీవించేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇదే తంతు నడుస్తోంది. సెలబ్రిటీలకు సంబంధించిన విడాకుల వార్తలు అయితే బయటకు వచ్చి రచ్చ రచ్చ అవుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య-సమంత మధ్య విడాకులు టాలీవుడ్‌లో పెనుదుమారాన్నే రేపాయి. ఇప్పటికీ వాళ్లిద్దరిపై మీమ్స్, కామెంట్లు సోషల్ మీడియాలో ఆగడం లేదు. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ విడాకులకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు ప్రియమణి. ప్రియమణి తన భర్త నుంచి దూరమయ్యే అవకాశాలున్నాయంటూ టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా టాక్ నడుస్తోంది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రియమణి వివాహం చేసుకుంది.
అయితే వివాహం తరువాత నుంచి ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముస్తఫాకు అంతకుముందే పెళ్లి అవ్వడం, అతని మొదటి భార్య, ప్రియమణిపై నిందలు వేయడం, విమర్శించడం జరిగాయి. అయినా అవేమి పట్టించుకోని ప్రియమణి తన భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ప్రస్తుతం వృత్తి రీత్యా ముస్తఫారాజ్ అమెరికాలో ఉంటున్నాడు. ప్రియమణి తన ప్రొఫెషన్ కోసం ఇండియాలో ఉంటున్నారు. ఏడాదికి ఒకసారి కూడా కలవడం కష్టమే. ఫోన్లు, మెసేజ్‌లు తప్పితే అరుదుగా కలుసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. వీళ్ల వివాహం జరిగి ఐదేళ్లు అవుతున్నా పిల్లలను కనలేదు. ప్రియమణి ప్రస్తుత వయసు 38 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆమె కెరీర్‌లో బిజీగా ముందుకు సాగుతూ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేశారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపి ప్రియమణి అరడజనుకు పైగా చిత్రాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త నుంచి విడిపోయినట్లు జోరుగా టాక్ నడుస్తోంది.
ఇటీవల మాధవన్ నటించిన రాకెట్రీ మూవీ విడుదల సమయంలో భర్తతో కలిసి ప్రియమణి సక్సెట్ మీట్లలో పాల్గొంది. అయినా వాళ్లిద్దరి బంధంపై సోషల్ మీడియాలో రూమర్లు ఆగడం లేదు. 2005లో జగపతిబాబు నటించిన పెళ్లయిన కొత్తలో మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న ప్రియమణి ఉపేంద్ర టాస్, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలతో వరుస హిట్లు అందుకుంది. హరేరామ్, మిత్రుడు, గోలీమార్, రగడ, చారులత వంటి వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల వెంకటేష్ నారప్ప, రానా నటించిన విరాటపర్వం సినిమాలతో ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అటు ఆహా ఓటీటీలో భామాకలాపం అనే సినిమాతో ప్రియమణి ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాధారణ గృహిణిగా నటించిన అందరినీ మెప్పించింది. కొన్నాళ్ల క్రితం వరకు మల్లెమాల నిర్వహిస్తున్న ఢీ షోలో జడ్జిగా కూడా ఆమె పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి మరోసారి ఆమె తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.