
టాలీవుడ్‌లో మెగా వారసురాలు నిహారికకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా తనకంటూ నిహారిక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ ఎవరు అంటే అందరూ నిహారిక అనే చెప్తారు. అందుకే మెగా ప్రిన్సెస్‌గా నిహారిక క్రేజ్ సంపాదించుకుంది. అయితే వెండితెరపై అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. 2016లో నాగశౌర్యతో ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్‌గా తొలిసారి నటించింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించినా అవి విజయవంతం కాకపోవడంతో నిహారికకు అవకాశాలు సన్నగిల్లాయి. వెండితెరపై కాకపోయినా బుల్లితెరపై యాంకర్‌గా మాత్రం నిహారిక తనదైన ముద్ర వేసింది. ఢీ జూనియర్స్ వంటి రియాలిటీ షోతో పాటు ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి షార్ట్ ఫిలింస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వంటి వెబ్ సిరీస్‌లతో నిర్మాతగా నిహారిక సత్తా చాటింది.
మరోవైపు వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. వివాహం చేసుకున్నా నిహారికలో జోరు తగ్గలేదు. వెండితెర, బుల్లితెరలతో పాటు సోషల్ మీడియాలోనూ నిహారిక ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తోంది. పైగా ఫ్యాషన్‌గా ట్రెండీగా ఉంటూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. హాట్ లుక్‌లతో అందరినీ ఫిదా చేస్తూ తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. పబ్‌లో అర్ధరాత్రి దొరికిపోయి మీడియాకు కూడా చిక్కింది. అయితే జిమ్ ట్రైనర్‌తో చనువుగా ఉంటూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి విమర్శల పాలైంది. ఈ మధ్య నిహారిక ఒంటరిగా ప్రయాణం చేయడం.. భర్త లేకుండా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి.. దీంతో కొందరు నెటిజన్లు నిహారిక తన భర్తను దూరం పెట్టేసిందా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే మెగా ఫ్యామిలీలో శ్రీజ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్‌దేవ్‌కు దూరంగా ఉండటంతో శ్రీజ అతడితో విడాకులు తీసుకుందని.. త్వరలో మూడో పెళ్లికి సిద్ధమవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీజ బాటలోనే నిహారిక కూడా వెళ్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. జొన్నలగడ్డ చైతన్య ఇండియాలోనే ఉన్నా నిహారికకు ఎందుకు దూరంగా ఉన్నాడంటూ పలువురు మెగా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిహారిక, చైతన్య మధ్య గొడవలు నడుస్తున్నాయని.. నిహారిక వ్యవహారశైలి చైతన్యకు నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో నాగబాబు ఇద్దరి మధ్య రాజీ కుదురుస్తున్నాడని అంటున్నారు. శ్రీజను నిహారిక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుందని మెగా ఫ్యామిలీలో మరోసారి డైవర్స్ తప్పదని కొందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయాలపై నిహారిక స్వయంగా స్పందిస్తే రూమర్లకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉంటుంది.