
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ఖుషి రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని చోట్ల హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల అయితే ఎలా ఉంటుందో అలా ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ జరిగాయి..కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం జల్సా మూవీ స్పెషల్ షోస్ గ్రాస్ ని క్రాస్ చేసింది..ఇది మామూలు విషయం కాదు..జల్సా సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోస్ వెయ్యగా దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఆ మొత్తం గ్రాస్ ని ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అధిగమించింది అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది..అదేమిటి అంటే ఈ చిత్రానికి కొన్ని చోట్ల బెన్ఫిట్ షోస్ కూడా వేస్తున్నారట..ఉదాహరణకి కర్నూల్ ప్రాంతం లో ఈ సినిమాకి శ్రీ రామ అనే థియేటర్ లో బెన్ఫిట్ షో ఏర్పాటు చేసారు..ఉదయం 5 గంటల ఆట నుండి షోలు ప్రారంభం కానున్నాయి..అక్కడ ఒక్కో టికెట్ ధర 500 రూపాయలకు అమ్మారట..ఇది నిజంగా విడ్డూరం అనే చెప్పాలి..ఈ ప్రాంతం లో కొంత మంది స్టార్ హీరోలకు కొత్త సినిమాలకే ఈ రేంజ్ రేట్స్ పెట్టారు..ఒకవేళ పెట్టినా ఎవ్వరూ కొనుగోలు చెయ్యరు..కానీ 20 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమాకి ఈ రేంజ్ రేట్స్ పెట్టినా జనాలు ఎగబడి కొనుగోలు చేసారంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అలా విడుదల కి ముందే ఎన్నో అద్భుతాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిత్రం..విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి..ఖుషి సినిమా దెబ్బకు ఇటీవల భారీ ఎత్తున రిలీజైన అవతార్-2 సినిమా కూడా కుదేలవుతోంది. బుక్ మై షో ట్రెండింగ్‌లో ఖుషి సినిమా ఉండటంతో పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క ప్రకటనతో ఈ స్థాయిలో ఖుషి సినిమాకు క్రేజ్ నెలకొని ఉండటంతో మిగతా స్టార్ల ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. ఒకప్పుడు ఖుషి టికెట్ల కోసం ఎంతగా పడిగాపులో కాశారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశాలున్నాయి.