
కాస్టింగ్ కౌచ్ అనే సమస్య టాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రమే కాదు..హాలీవుడ్ లో కూడా ఉంది, ఎక్కడికి వెళ్లినా అమ్మాయిల మీద అత్యాచారాలు ఆగడం లేదు.ఇలాంటి క్రూర మృగాలు ఉన్న చోట అవకాశాలు దక్కించుకోవడం కోసం కొంతమంది హీరోయిన్లు సర్దుకుపోతుండగా, మరి కొంతమంది హీరోయిన్లు అందం, టాలెంట్ పెట్టుకొని కూడా సినిమా ఇండస్ట్రీ నుండి పారిపోవాల్సి వస్తుంది.అలా అని ఇండస్ట్రీ మొత్తం ఇలాగే ఉంటుంది అని కాదు.కొంతమంది దరిద్రులు చేసే అఘాయిత్యాలకు సినిమా ఇండస్ట్రీ అంటేనే సామాన్యులకు అసహ్యం కలిగించేలా చేస్తుంది.రీసెంట్ గా ఇలాగే ఒక హాలీవుడ్ నిర్మాత హీరోయిన్ పై బలవంతం చేయబోతే అతనిపై పోలీస్ కేసు పెట్టి కటకటాలపాలయ్యేలా చేసింది.ఇంతకీ ఆ ఉదంతం ఏంటో పూర్తిగా ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.
వివరాల్లోకి వెళ్తే ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెన్ స్టీన్ ఒక ప్రముఖ హీరోయిన్ పై 2013 వ సంవత్సరం లో అత్యాచారం చేసే ప్రయత్నం చేసాడు.దీనితో తెగించిన ఆ అమ్మాయి ఎలాంటి భయం లేకుండా అమెరికన్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.ఈ కేసు పై విచారణ చేపట్టిన లాస్ ఏంజిల్స్ కోర్టు, అతను నిజంగానే అత్యాచారం చేసాడని నిర్ధారించింది.దాంతో ఇతనికి 23 సంవత్సరాల జైలు శిక్ష పడింది.మరో విశేషం ఏమిటంటే గొప్ప చిత్రాలను నిర్మించినందుకు హార్వే కి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది.అలాంటి ప్రముఖ నిర్మాత ఇంత దిగజారి ప్రవర్తించడం అనేది మింగుడు పడని విషయం.మరో ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటికే న్యూ యార్క్ లో జైలు జీవితం గడుపుతున్న ఈయనకి మరో 16 సంవత్సరాల జైలు శిక్ష పడిందట.
ఇంతకీ ఆ నటి పేరు ఏమిటంటే బెవర్లీ హిల్స్.యూరోపియన్ కంట్రీ కి సంబంధించిన ఈమె ఎన్నో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో మరియు వెబ్ సిరీస్ లలో నటించింది.ధైర్యం తో ఈ అమ్మాయి తీసుకున్న ఈ నిర్ణయం వాళ్ళ ఆ మృగాడిని జీవితాంతం జైలులో ఊచలు లెక్కపెట్టేలా చేసింది.మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్ కి గురి చేసిన నిర్మాతలపై ఇలాగే కేసులు పెడితే కనీసం 100 మంది అయినా జైలు పాలవ్వడం ఖాయమని నెటిజెన్లు చెప్తున్న మాట.మరి మన హీరోయిన్స్ కూడా ఇలాగే ధైర్యం గా అడుగులు ముందుకు వెయ్యగలరా..?, ఒక్కసారైనా అలా చేస్తే ఇండస్ట్రీ పై జనాల్లో ఉన్న చెడు అభిప్రాయం కాస్త అయినా తగ్గుతుందని అంటున్నారు విశ్లేషకులు.