
సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా దశాబ్దాల నుండి కొనసాగుతున్న నటి సమంత..ఏం మాయ చేసావే అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన సమంత అటు తన అందం తో పాటుగా అద్భుతమైన నటన తో అశేష ప్రజాదరణ పొందింది..ఈమెకి ఉన్న క్రేజ్ కొంతమంది హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..దానికి రీసెంట్ ఉదాహరణ గా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ చిత్రం నిలిచింది..ఇది ఇలా ఉండగా సమంత ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తుంది..ఆమె కొంతకాలం నుండి ‘మయోసిటిస్’ అనే అరుదైన వింత ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతుంది..ఇందుకోసం ఆమె గత కొంతకాలం గా శస్త్ర చికిత్స తీసుకుంటుంది..మయోసిటిస్ అంటే ‘కండరాల క్షీణిత’ వ్యాధి అని సమాచారం..ఈ వ్యాధి కి అమెరికా లో కూడా చికిత్స లేదు..కానీ సమంత కోసం వివిధ దేశాల నుండి వైద్యులు వచ్చి చికిత్స అందిస్తున్నారు..ఆ చికిత్స ప్రస్తుతం హైదరాబాద్ లోనే కొనసాగుతుంది.
అయితే ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ విషమంగా మారిందని తెలుస్తుంది..అయితే సౌత్ కొరియా లో ఈ వ్యాధి కి చికిత్స ఉందని..అక్కడ ఈ వ్యాధి పట్ల నిశాతులకు కొరతే ఉండదని అందుకే సమంత ని అక్కడికి తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అక్కడ ఆమెకి మరింత మెరుగైన వైద్యం అందించి అభిమానుల ప్రార్థనల బలంతో సాధ్యమైనంత తొందరగా కోలుకునేలా చేస్తామని వైద్యులు సమంత కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్తున్నారట..సమంత కి ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఆమె తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లడమే..నాగ చైతన్య ని ఆమె ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంది..అలాంటి వ్యక్తి తో విడాకులు జరగడం సమంత అసలు తీసుకోలేకపోయింది..మానసికంగా ఎంతగానో కృంగిపోయింది..విడాకులు జరిగిన తర్వాత ఆమె ఏడవని రోజంటూ లేదని ఆమె సన్నిహితులు మరియు మిత్రులు చెప్తూ ఉంటారు..తన దృష్టిని మరలించడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసిందట..ఆ క్రమం లోనే ఆమె జిమ్ లో వర్కౌట్స్ చాలా తీవ్ర స్థాయిలో చేసేడట.
అందువల్లే సమంత కి ఈ అరుదైన వింత వ్యాధి సోకినట్టు తెలుస్తుంది..సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ , మరియు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’ వంటి చిత్రాల్లో నటిస్తుంది..ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం ఆమె ఆరోగ్య సమస్యల కారణంగానే ఆగిపోయాయి..ఆమె తొందరగా కోలుకోవాలని..ఎప్పటిలాగానే సినిమాలు చేస్తూ అలరించాలని..నలుగురికి సహాయం చేసే సమంతాని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు..మరోపక్క నాగ చైతన్య తన కొత్త గర్ల్ ఫ్రెండ్ శోభిత దూళిపాళ్లతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు..త్వరలో వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..సమంత కి ఈ పరిస్థితి రావడానికి ప్రధానకరణమై నువ్వు మాత్రం సంతోషం గా ఉంటావా అంటూ నాగ చైతన్య పై ఒక్కసారిగా సోషల్ మీడియా లో చాలా తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది..అంతే కాకుండా సమంత ఆరోగ్య పరిస్థితి పై నాగ చైతన్య ఇప్పటి వరుకు ఒక చిన్న కామెంట్ కూడా చెయ్యకపోవడం పై అభిమానులు తప్పుపడుతున్నారు.