
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ పాగా వేశాడు. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా అక్కడి మీడియా దృష్టిలో పడి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్‌లకు విజయ్ క్రష్‌గా మారాడు. ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ కూడా ఈ జాబితాలో ఉంది. విజయ్ దేవరకొండతో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని అభిప్రాయాన్ని జాన్వీకపూర్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో విజయ్ -జాన్వీ మధ్య ఏదో నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీని జాన్వీకపూర్ కలిసినట్లు కనిపిస్తోంది.
ఇటీవల తన అమ్మతో కలిసి హీరో విజయ్ దేవరకొండ జాన్వీకపూర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్ అమ్మతో జాన్వీకపూర్ ఫోటో పోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముంబైలో జాన్వీతో కలిసి విజయ్ దేవరకొండ ఓ యాడ్‌లో నటించాడు. ఈ యాడ్ షూట్ ముగిసిన అనంతరం విజయ్ ఫ్యామిలీని జాన్వీ తన ఇంటికి ఆహ్వానించింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మర్యాదలతో పూలు, పండ్లు, స్వీట్లతో జాన్వీ ఇంటికి వెళ్లింది. దీంతో విజయ్, జాన్వీకపూర్ మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని.. త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జాన్వీకపూర్ లేటెస్ట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మతులను పోగొడుతోంది. తన అందచందాలతో నెటిజన్‌లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె మిలీ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్‌ల కోసం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.
అర్జున్ రెడ్డి సినిమాతో తన ఫాలోవర్లను విజయ్ దేవరకొండ అమాంతం పెంచేసుకున్నాడు. కెరీర్‌లో తక్కువ టైంలోనే స్టార్ డమ్ సంపాదించిన ఈ యువ హీరో యాక్టింగ్‌కు ఫిదా అయ్యే వారిలో మూవీ లవర్స్, అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. రష్మిక, జాన్వీకపూర్ సహా పలువురు హీరోయిన్‌లు విజయ్ క్రష్‌లుగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో అయితే విజయ్‌తో కలిసి నటించాలని జాన్వీకపూర్ చెప్పింది. విజయ్ గిఫ్టెడ్ యాక్టర్ అంటూ కితాబిచ్చింది. విజయ్ దేవరకొండ పెద్ద స్టార్, సినిమాటిక్ యాక్టర్ మాత్రమే కాదని, గొప్ప వ్యక్తి కూడా అని ఆకాశాకెత్తేసింది. స్టార్‌గా మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులో విజయ్ స్థానం సంపాదించుకున్నాడని జాన్వీకపూర్ చెప్పింది. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆమె అనారోగ్యం బారిన పడటంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా కృతి శెట్టి కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.