Home Entertainment బ్రేకింగ్ : ‘వీర సింహా రెడ్డి’ ప్రదర్శనలు ఆపివెయ్యాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు..? నందమూరి అభిమానులకు బిగ్ షాక్

బ్రేకింగ్ : ‘వీర సింహా రెడ్డి’ ప్రదర్శనలు ఆపివెయ్యాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు..? నందమూరి అభిమానులకు బిగ్ షాక్

0 second read
0
0
5,721

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఆయన ప్రతీ సినిమాలో ‘సింహా’ పేరు కచ్చితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సింహం గాండ్రింపు లాగే బాలకృష్న డైలాగ్స్ థియేటర్లో పేలుతుంటాయి. సినిమా సంగతి ఎలా ఉన్నా.. బాలకృష్ణ కొట్టే డైలాగ్స్ వినడానికే చాలా మంది సినిమా చూస్తుంటారని అనుకుంటూ ఉంటారు. అలాగే బాలయ్య నటించిన లెటేస్ట్ మూవీ వీరసింహారెడ్డి సినిమాలో డైలాగ్స్ అదరగొట్టాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ సందర్భంగా కొన్ని డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సినిమాకు సంబంధించిన కొన్నిక్లిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఏపీలోని అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించినవేనని చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాపై ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

భారీ డైలాగ్స్ అదరగొట్టే ప్రతీ బాలకృష్ణ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈసారి సంక్రాంతి సందర్భంగా 12న రిలీజైన వీరసింహారెడ్డి అదే లెవల్లో ఉంది. ఈ సినిమా స్టోరీ యావరేజ్ గానే ఉందని టాక్. కానీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. రెండు మూడు రోజుల పాటు ఈ సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉంటుందని ఫ్యాన్స్ అసోషియేషన్ నాయకులు చెబుతున్నారు. దాదాపు సంక్రాంతి ఫెస్టివెల్ ఇక్కడే జరుపుకుంటున్నాని కొందరు ఉత్సాహంగా చెబుతున్నారు.

బాలకృష్ణ చేసే డైలాగ్స్ రాజకీయంగా రచ్చ రేపుతాయి. అయితే ప్రస్తుతం వీరసింహారెడ్డిలోని కొన్ని డైలాగ్స్ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసే విధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ‘పాలించడం అంటే అభివృద్ధి.. ప్రజలను వేధించడం కాదు..’ ‘జీతాలు ఇవ్వడం అంటే అభివృద్ధి.. బిచ్చం వేయడం కాదు..’ ‘పనిచేయడం అంటే అభివృద్ధి.. పనులు ఆపడం కాదు..’ ‘ నిర్మించడం అంటే అభివృద్ధి.. కూల్చడం కాదు’.. ‘పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలు మూసివేయడం కాదు..’ అనే డైలాగ్స్ బాగా పేలుతున్నాయి..టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేసినట్లుగానే ఈ డైలాగ్స్ ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే సినిమాలోని సిచ్చువేషన్ తగ్గట్లుగా చేర్చారని అంటున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే బాలకృష్ణ ఈ డైలాగ్స్ రాయించారని అనుకుంటున్నారు. ఈ డైలాగ్స్ ప్రజల్లో ఆలోచన రావడం ఖాయమని కొందరు టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

అయితే తమను కించపరిచే విధంగా వీరసింహారెడ్డి సినిమా డైలాగ్స్ ఉన్నాయని కొందరు వైసీపీ చెందిన నాయకులు అంటున్నారు. ఇందులో భాగంగా ఆ సినిమా నడిచే థియేటర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ థియేటర్లలోని ఆ డైలాగ్స్ రికార్డ్ కాకుండా చూసే అవకాశం ఉంది. లేదా ఆ సమయంలో బీప్ సౌండ్ వచ్చే విధంగా చేస్తారని అంటున్నారు. కానీ ఇప్పటికే ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఈతరుణంలో ఆ సినిమాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నష్టమేమి ఉండదని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రభావితం చూపుతాయని టీడీపీ శ్రేణులు అంటున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…