Home Entertainment బ్రేకింగ్ : విషమంగా మారిన బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి..ఆందోళన కలిగిస్తున్న లేటెస్ట్ హెల్త్ బులిటెన్

బ్రేకింగ్ : విషమంగా మారిన బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి..ఆందోళన కలిగిస్తున్న లేటెస్ట్ హెల్త్ బులిటెన్

2 second read
0
0
1,365

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ. తమిళంలో సంగీత దర్శకుడిగా, హీరోగా పలు సినిమాల్లో నటించినా బిచ్చగాడు సినిమాతోనే విజయ్ ఆంటోనీకి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ బిజీబిజీగా ఉన్నాయి. అయితే అనుకోని రీతిలో ఈ సినిమా షూటింగ్‌లో పెద్ద ప్రమాదం జరిగింది. బిచ్చగాడు 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ చేస్తున్న సమయంలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ బోట్ సీన్ షూట్ చేస్తుండగా విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న బోట్ అదుపు తప్పి మరో బోట్‌ను ఢీకొట్టిన క్రమంలోనే విజయ్ ఆంటోనీకి గాయాలయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ అతడిని మలేషియాలో ఓ ఆసుపత్రికి తరలించింది. డాక్టర్ల పర్యవేక్షణలో విజయ్ ఆంటోనీకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

బిచ్చగాడు 2 మూవీ షూటింగ్‌లో ప్రమాదం జరిగిందన్న వార్త విని విజయ్ ఆంటోనీ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది . ఫ్యామిలీ అంతా కూడా హుటాహుటిన మలేషియాకు వెళ్లింది. అయితే అక్కడి నుంచి విజయ్‌ను చెన్నైకి తీసుకొచ్చినట్లు ఆయన భార్య ఫాతిమా చెప్పారు. విజయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఆమె చెప్పడం ఆందోళన రేకెత్తిస్తోంది. బోటు ప్రమాదంలో విజయ్ ఆంటోనీ పళ్ళు, దవడ ఎముకలు విరిగినట్లు తెలుస్తుండటంతో అతడి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. విజయ్ ఆంటోనీ అపస్మారక స్థితిలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో తమ హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, విజయ్ ఆంటోనీకి నడుముకు తేలికపాటి దెబ్బ మాత్రమే తగిలిందని కొందరు కుటుంబీకులు అంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని విజయ్ ఆంటోనీ చెన్నై చేరుకున్నాడని వివరించారు. ప్రస్తుతం కోలుకుని తన సినిమా పనుల్లో పాల్గొంటున్నాడని పేర్కొన్నారు.

కాగా బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు గతేడాదే మేకర్స్ ప్రకటించారు. కరోనా కారణంగా పనులు నత్తనడకన సాగాయి.ప్రస్తుతం షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని వేసవికి థియేటర్లలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఇంతలోనే విజయ్ ఆంటోనీ గాయపడటం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ మూవీ తమిళంలో పిచ్చైక్కరన్ 2 పేరుతో, తెలుగులో బిచ్చగాడు2 పేరుతో రానుంది. కన్నడలో భిక్షుకా-2, మలయాళంలో భిక్షాక్కరన్-2 పేరుతో విడుదల కానుంది. బిచ్చగాడు -2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్ ఆంటోనీ కొన్నిరోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. గతంలో డాక్టర్ సలీం చిత్రంలో నటించినా విజయ్ ఆంటోనీకి పెద్దగా పేరు రాలేదు. కానీ బిచ్చగాడు అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. అటు వ్యక్తిగత జీవితంలో ఫాతిమా అనే ఒక జర్నలిస్టును విజయ్ ఆంటోనీ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…