
ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన్య దగ్గర నుండి వరుసగా విడాకులు తీసుకుంటూనే ఉన్నారు సెలబ్రిటీస్.ఇప్పుడు రీసెంట్ గా నిహారిక కొణిదెల – చైతన్య కూడా విడాకులు తీసుకున్నారు అంటూ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.వీళ్లిద్దరి పెళ్లి నాగబాబు ఎంత ఘనంగా చేయించాడో అంత తేలికగా ఎవ్వరు మాత్రం మర్చిపోగలరు.పెద్దగా అతిధులను ఆహ్వానించకపోయిన కూడా జీవితాంతం గుర్తుండిపోయ్యేలా, ఇటీవల కాలం లో ఏ సెలబ్రిటీ చేసుకోనంత ఘనంగా ఈ వివాహ మహోత్సవాన్ని జరిపించాడు.సోషల్ మీడియా లో #Nischay అనే ట్యాగ్ ని క్లిక్ చేస్తే వీళ్ళ వివాహ మహోత్సవ సంబరాలకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు చూడవచ్చు.ఇప్పటికీ ఆ సంబరం ని చూస్తే మెగా అభిమానుల కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.మంచి క్యూట్ జంటగా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో కలకలం రేపుతోంది.
గత కొంత కాలం నుండి వీళ్లిద్దరు విడివిడిగానే ఉంటున్నారట.విడాకులకు అప్లై చెయ్యగా ఈమధ్యనే కోర్టు మంజూరు చేసినట్టు తెలుస్తుంది.ఇంస్టాగ్రామ్ లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న వీడియోలు , ఫోటోలు అప్పట్లో అప్లోడ్ చేసారు.ఇప్పుడు అవన్నీ డిలీట్ చేసేసారు, ఒకరిని ఒకరు అన్ ఫాలో అయిపోయారు.దీనిని మెగా అభిమానులు గుర్తించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.వెంటనే ఒక రేంజ్ లో వైరల్ అయిపోయింది.ఇదంతా చూస్తూ ఉంటె అసలు మెగా ఫ్యామిలీ కి పెళ్లి అనేదే అచ్చి రాదా అనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ కి ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.చిరంజీవి రెండవ కూతురు శ్రీజా కి కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయి, రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో రీసెంట్ గానే ఆమె విడాకులు తీసుకున్నట్టు సమాచారం.ఇప్పుడు లేటెస్ట్ గా నాగబాబు కూతురు నిహారిక పరిస్థితి కూడా ఇంతే.ఎందుకు వీళ్ళకే ఇలా జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న.
చిరంజీవి , నాగ బాబు తర్వాత రామ్ చరణ్ ఒక్కడే మంచి దాంపత్య జీవితం గడుపుతున్నాడు.వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగిన ఒకరంటే ఒకరికి ప్రాణం గా ఉండడం మనం గమనించొచ్చు.పెళ్ళై పదేళ్లు దాటినా పిల్లలు లేకపోయినా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడలేదు.కనీసం మాటవరుసకి విడాకులు తీసుకుంటున్నారు అనే పుకారు కూడా రాలేదు.అంత మంచి సాన్నిహిత్యం తో దాంపత్య జీవితం గడుపుతున్నారు.ఈ విషయం లో అందరూ రామ్ చరణ్ ని మెచ్చుకుంటున్నారు.