
ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా అభిమానులందరూ సంబరాల్లో ఉన్నారు. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్‌చరణ్ ఎట్టకేలకు తండ్రి కాబోతున్నాడు అన్న వార్త తెలియడమే. దీంతో ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ అభిమానులు పాటలు పాడుకుంటున్నారు. తమకు మరో బుల్లి హీరో రాబోతున్నాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రామ్‌చరణ్‌కు వివాహమై పదేళ్లు కావస్తుండటంతో ఇన్నాళ్లకు సంతానం కలుగుతోందని కామెంట్ చేస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనతో 2012 జూన్‌లో రామ్‌చరణ్ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సంతానం లేకపోవడంతో మెగా అభిమానులు శుభవార్త కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఈ పదేళ్లలో ఉపాసన ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఎప్పుడు అంటూ ఎన్నో ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టవి. తమ వ్యక్తిగత విషయం అని తెలిసినా మీడియా మాత్రం పదేపదే ఈ విషయం అడిగి ఉపాసనను ఇబ్బంది పెట్టేది. అయినా ఉపాసన ఎలాంటి విసుగు లేకుండా సమాధానం చెప్పేది.
రామ్‌చరణ్, ఉపాసన దంపతులది పెద్దలు కుదిర్చిన వివాహం. చెన్నైలో ఉండే సమయంలో చరణ్, ఉపాసన ఒకే స్కూలులో చదువుకున్నారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే వీరిది ప్రేమ వివాహం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఉపాసన తనకు తెలుసు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకునేందుకు చరణ్ ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదు. అయితే సంతానం విషయంలో మాత్రం ఉపాసన మాటకు విలువ ఇచ్చి వెయిట్ చేశాడు. ఎట్టకేలకు ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వార్తను రివీల్ చేయడం విశేషం. చిరంజీవి అంటే హనుమాన్‌కు మరో పేరు. చిరంజీవి కన్నతల్లి పేరు కూడా అంజనా దేవి కావడం విశేషం. చెర్రీ పూర్తి పేరు రామ్‌చరణ్ తేజ. అంటే రాముని పాదాల దగ్గర వెలిగే తేజం అంటే హనుమంతుడు అని అర్థం. ఎలా చూసినా చిరంజీవి కుటుంబసభ్యులకు హనుమంతుడు అంటే ఎంతో భక్తి అని తెలుస్తోంది. అంతేకాకుండా చిరు సొంత బ్యానర్ కొణిదెల బ్యానర్‌లోనూ హనుమంతుడి బొమ్మ దర్శనమిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆంజనేయస్వామి కరుణతో చెర్రీ, ఉపాసన దంపతులు అమ్మా, నాన్న అన్న పిలుపుకు నోచుకోబోతున్నారని చిరంజీవి ప్రకటించాడు. అయితే రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉపాసనను టెస్ట్ చేసిన డాక్టర్లు ఈ విషయం రివీల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉపాసనకు ప్రస్తుతం మూడో నెల అని సమాచారం. అయితే కవలలు పుడతారో లేదో కొన్ని నెలలు ఆగితే క్లారిటీ రానుంది. ఏదేమైనా చరణ్ కూడా తండ్రి అవుతున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చరణ్‌కు మరపురానిదిగా మిగిలిపోయిందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా రామ్‌చరణ్ క్రేజ్ సంపాదించుకున్నాడని.. ఈ సినిమా ద్వారా తన నటనతో పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులను మెప్పించాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి, బుచ్చిబాబు సానతో వరుసగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.