Home Entertainment బ్రేకింగ్: బిగ్ బాస్ లో మరో మోసం..శ్రీ సత్య కోసం ఆది రెడ్డి ని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

బ్రేకింగ్: బిగ్ బాస్ లో మరో మోసం..శ్రీ సత్య కోసం ఆది రెడ్డి ని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

0 second read
0
0
2,071

ఈ సీజన్ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..భారీ అంచనాల నడుమ 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 7 మందికి చేరుకుంది..ఈ 7 మందిలో శ్రీహాన్ టికెట్ 2 ఫినాలే టాస్కు గెలిచి టాప్ 5 లోకి వెళ్ళిపోయాడు..ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లో రేవంత్, రోహిత్ , ఇనాయ స్థానాలు ఖారారు అయిపోయాయి..ఇక మిగిలి ఉన్న ఆ 5 వ స్థానం కోసం మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ శ్రీ సత్య , ఆది రెడ్డి మరియు కీర్తి పోటీ పడుతున్నారు..వీళ్ళ ముగ్గురు మధ్య ఓటింగ్ చాలా టఫ్ గా ఉంది..స్వల్ప ఓట్ల తేడాతోనే కొనసాగుతున్నారు..అందువల్ల ఎవరు వీరిలో టాప్ 5 లోకి పోతారు అనేది పెద్ద ప్రశ్న గా మారింది..నిన్న మొన్నటి వరుకు ఆది రెడ్డి టాప్ 5 లోకి అడుగుపెడతాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు..ఎందుకంటే శ్రీ సత్య ని కచ్చితంగా టాప్ 5 లోకి పంపించాలనే లక్ష్యంగా బిగ్ బాస్ టీం పెట్టుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి..ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే శ్రీ సత్యకి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి..కానీ ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం లేదట..ఆమె బదులు ఆది రెడ్డి ని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తుంది..ఆయన బిగ్ బాస్ జర్నీ కి సంబంధించిన AV ని కూడా సిద్ధం చేసేసారట..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది..అనధికారిక పొలింగ్స్ అన్నిట్లో ఆది రెడ్డి కి శ్రీ సత్య కంటే భారీ మార్జిన్ తేడాతో ఆధిక్యం ఉంది..కానీ ఆది రెడ్డి ని ఎలిమినేట్ చెయ్యడానికి బిగ్ బాస్ చేస్తున్న కుట్ర ని ఏ మాత్రం సహించబోము..ఇక జీవితం లో బిగ్ బాస్ షో చూడము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ కూడా సెలబ్రిటీస్..ఒక్క ఆదిరెడ్డి మాత్రమే కామన్ మ్యాన్..ఒక కామన్ మ్యాన్ ఎలాంటి సపోర్టు లేకుండా బిగ్ బాస్ లో ఇన్ని రోజులు కొనసాగడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు..అలాంటి కంటెస్టెంట్ టాప్ 5 లోకి అడుగుపెడితే ఒక చరిత్ర అవుతుంది..కానీ బిగ్ బాస్ లో జరుగుతున్నా రాజకీయాల వల్ల అది సాధ్యపడడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు..ఈ సీజన్ లో ఎలిమినేషన్స్ అన్నీ కూడా అలాగే జరిగాయని..అందుకే ఎంత ప్రయత్నం చేసిన ఈ సీజన్ కి టీఆర్ఫీ రేటింగ్స్ రావడం లేదని చెప్తున్నారు..సోషల్ మీడియా లో జరుగుతున్నా ఈ ప్రచారం ప్రకారం ఆది రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయితే మాత్రం ..బిగ్ బాస్ హిస్టరీ లో ఇంత మోసపూరిత సీజన్ ఎప్పుడు రాలేదని ఫిక్స్ అయిపోవచ్చు..చూడాలి మరి ఏమి జరగబోతుందో.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…