
బాలీవుడ్ మళ్లీ చాన్నాళ్లకు కళకళలాడుతున్నట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర ఫస్ట్ ఫార్ట్ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈనెల 9న విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. విజువల్ ఎఫెక్ట్స్ తప్ప సినిమాలో కంటెంట్ లేదని విమర్శకులు స్పష్టం చేశారు. అయితే అమితాబ్, షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ హీరోలు నటించడంతో టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మూవీ టాలీవుడ్‌లో విడుదలైన బాలీవుడ్ సినిమాలకు సంబంధించి మొదటిరోజు రికార్డు కలెక్షన్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా రికార్డులకెక్కింది. తొలిరోజు బ్రహ్మాస్త్ర మూవీ రూ.6.7కోట్లు వసూళ్లు సొంతం చేసుకుంది. గతంలో అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ నటించిన ధూమ్-3 సినిమా రూ.4.70 కోట్లు వసూలు చేసింది.
మరోవైపు తొలి వీకెండ్‌లో బ్రహ్మాస్త్ర మూవీ సంతృప్తికర వసూళ్లను రాబట్టింది. తెలుగులో తొలి మూడు రోజుల్లో రూ.12 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా మూడు రోజుల్లో రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండోరోజు 40 శాతం డ్రాప్స్ ఉన్నా మూడో రోజు ఆదివారం కావడంతో కొంచెం పుంజుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిక్స్‌డ్ టాక్‌తో బాయ్‌కాట్ ట్రెండ్‌తో బ్రహ్మాస్త్ర ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యకరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలుగులో రాజమౌళి సమర్పించిన ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోనూ బ్రహ్మాస్త్ర రిలీజైంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో రూ.7కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.8 కోట్ల రాబట్టాల్సి ఉండగా అంతకంటే ఎక్కువే రాబట్టడంతో బయ్యర్లకు కేవలం మూడు రోజుల వసూళ్లతోనే ప్రాఫిట్ వెంచర్‌గా నిలిచింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దానితో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సినిమాలో రోల్ చేయడం, ఆ సినిమా కంటే ముందు ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ నటించడం ప్లస్ అయ్యింది. అక్కినేని అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరిచారు. తొలుత రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్ రద్దు కావడంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సుమారు 400 కోట్ల రూపాయలతో ‘బ్రహ్మాస్త్ర’ను రూపొందించారు. ఇప్పుడు అంత డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అనే విషయం పక్కన పెడితే… ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన పీవీఆర్, ఐనాక్స్ సంస్థలకు భారీ లాస్ వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’ ఫ్లాప్ కావడంతో ఇండియాలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్స్ అయినటువంటి ఈ రెండూ శుకవారం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 800 కోట్లకు పైగా నష్టపోయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర’ విడుదలకు ముందు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ వచ్చాయి. ఎన్ని లక్షల టికెట్లు విక్రయించామనేది చెబుతూ… సినిమాపై హైప్ పెంచాయి. శుక్రవారం తొలి ఆట వరకూ ఆ హైప్ ఎంతో ఉపయోగపడింది. అయితే మిక్స్‌డ్ మౌత్ టాక్ అనేది వాళ్ళ బిజినెస్ మీద కూడా ప్రభావం చూపించింది.