Home Entertainment బ్రహ్మాస్త్ర మొదటి వారం వసూళ్లు..బాలీవుడ్ మరో కోలుకోలేని షాక్

బ్రహ్మాస్త్ర మొదటి వారం వసూళ్లు..బాలీవుడ్ మరో కోలుకోలేని షాక్

0 second read
0
0
214

ఈ ఏడాది #RRR సినిమా తర్వాత భారీ బడ్జెట్ , భారీ తారాగణం మరియయు భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా బ్రహ్మాస్త్ర..బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఆయన ముఖర్జీ దర్శకత్వం లో రణబీర్ కపూర్ మరియు అలియా భట్ లు హీరోహీరోయిన్లు గా నటించగా, అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ మరియు అక్కినేని నాగార్జున వంటి వారి ముఖ్య పాత్రలు పోషించారు..విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండడం తో ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే కాస్త డివైడ్ టాక్ అయితే వచ్చింది..కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి..కేవలం 3 రోజుల్లోనే 225 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం తెలుగు లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, హిందీ లో ఇప్పటి వరుకు 50 శాతం రికవరీ చేసింది..మొదటి వారం లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి సుమారు 32 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించి రెండేళ్ల తర్వాత బాలీవుడ్ లో సెన్సషనల్ ఓపెనింగ్ ని దక్కించుకున్న హిందీ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..అంతే కాకుండా ఈ సినిమాకి తెలుగు లో కూడా ఎవ్వరు ఊహించని రేంజ్ వసూళ్లు..మొదటి రోజు ఈ సినిమాకి ఇక్కడ దాదాపుగా 4 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ కేవలం ఆరు కోట్ల రూపాయలకు జరగగా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ గా నిలిచింది..ఇప్పుడు మొదటి వారం మొత్తానికి కలుపుకొని ఈ సినిమా తెలుగులో 13 కోట్ల రూపాయలుగా పైగా షేర్ ని సాధించింది..అంటే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట..అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు రాజమౌళి ప్రొమోషన్స్ ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు..ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ ౧౭ కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక హిందీ లో అయితే ఈ సినిమాకి పని దినాలలో కూడా అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి..అప్పటి వరుకు ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ హిట్ అవ్వాలంటే మరో 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది..అంత మొత్తం వసూళ్లు రావాలంటే ఈ సినిమాకి భారీ సెకండ్ వీకెండ్ అవసరం ఉంది..సెకండ్ వీకెండ్ లో కనీసం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి..సెకండ్ వీకెండ్ అద్భుతంగా ఉంది..ఇంకో రెండు వారల పాటుగా డీసెంట్ స్థాయి వసూళ్లను ఈ సినిమా రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…