
ఎవరి పేరు చెపితే మన ముఖం అనందం తో వెలిగిపోతుందో, ఎవరు పేస్ చూస్తే మన ఇంట్లో ఉన్న కష్టాలు అన్ని మర్చిపొయ్యి కడుపుబ్బా నవ్వుకుంటామో, ఎవరిని చూసి థియేటర్స్ కి బారులు తీస్తే క్యూ కడుతారో అతనే మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు, ఒక్క స్టార్ హీరో కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ కమెడియన్ ఎవరు అంటే అది మన బ్రహ్మానందం గారే,వెండితెర మీద ఆయన కనిపిస్తే చాలు ఈలలు కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోతాది, అంతతి క్రేజ్ ఉన్న బ్రహ్మానందం దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం ని సంపాదించాడు,నిర్మాతలు బ్రహ్మానందం డేట్స్ కోసం క్యూ కట్టే వారు,ఒక్క ఏడాది లో ఆయన వందకి పైగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి అంతే ఏ మాత్రం అతి సయోక్తి కాదు, అది బ్రహ్మానందం గారికి ఉన్న క్రేజ్, అలాంటి డిమాండ్ ఉన్న బ్రహ్మానందం గారు ఇటీవల కాలం లో కాస్త స్లో అయ్యారు,దానికి కారణం ఆయన ఆరోగ్యమే అని స్వయంగా బ్రహ్మానందం గారే పలు సందర్భాలలో తెలిపారు, గుండెకి సంబంధించి కాస్త నలతగా ఉండడంతో ఆయన బైపాస్ సర్జెరీ చేసుకున్నారు.
డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన సినిమాలు చెయ్యడం తగ్గిస్తూ వచ్చారు, బ్రహ్మానందం గారికి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత మన టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ హీరోలందరూ ఆయన ఇంటికి వెళ్లి ఆయన క్షేమ సమాచారం గురించి తెలుసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇక ఆపరేషన్ జరిగి చాలా కాలం అవ్వడం ,బ్రహ్మానందం గారు ఇప్పుడు మునుపటి లాగ ఉండడం తో మళ్ళీ ఆయన మెళ్లిగా సినిమాలను ఒప్పుకోవడం ప్రారంభించారు, అలా ఆయన చేస్తున్న సినిమాలలో ఇటీవలే విడుదల అయినా సినిమా తెలంగాణ దేవుడు , శ్రీకాంత్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక్క ముఖ్య పాత్ర పోషించారు, ఎప్పుడు కమెడియన్ గా కనిపించే బ్రహ్మానందం గారు, ఈ సినిమాలో శ్రీకాంత్ గారికి గురువుగా నటించారు., ఇందులో ఆయన పండించిన సెంటిమెంట్ ని చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు, ఆ స్థాయిలో ఆయన ఆ పాత్రలో జీవించేసారు, గత వారం విడుదల అయినా ఈ సినిమా థియేటర్స్ లో దిగ్విజయం గా నడుస్తుంది, సాధారణంగా ఎప్పుడు ఏ సినిమాకి కూడా ప్రత్యేకమైన ప్రొమొతిఒన్స్ చెయ్యని బ్రహ్మానందం గారు, ఈ సినిమా కోసం ఒక్క ప్రత్యేకమైన బైట్ ని విడుదల చేసారు, ఈ బైటలోని బ్రహ్మానందం గారి లుక్ ని చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడు మన అందరిని నవ్వించే బ్రహ్మానందం గారు, ఇలా ముసలి వాడు అయిపోతుండం చూసి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు, కానీ మనిషి అన్నాక ముసలివాళ్ళు అవ్వాల్సిందే అనే జీవిత సత్యం ని మనం ఎవ్వరమూ మరువలేము, ఇక ఈ బైట్ లో బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఈ సినిమాని దయచేసి నాకోసం ఆదరించాల్సిందిగా ఎంతో ఎమోషనల్ గా అభిమానులను కోరాడు, బ్రహ్మానందం ని ఇంత ఎమోషనల్ గా మనం ఎప్పుడు చూసి ఉండము, ఆ స్థాయిలో ఆయన ఆ పాత్రకి కనెక్ట్ అయ్యాడట, వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కినా బ్రహ్మానందం ఈ సినిమా గురించి ఇంత ఎమోషనల్ అయ్యాడు అంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉన్న సినిమా అనే అర్థం చేసుకోవచ్చు,ఇది ఇలా అండగా బ్రహ్మానందం ఈ ఏడాది జాతి రత్నాలు అనే సినిమా ద్వారా మన ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కానక వర్షం కురిపించింది, ఇందులో జడ్జి గా బ్రహ్మానందం చేసిన కామెడీ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు, వచ్చే ఏడాది నుండి ఆయన మల్లి పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అట,ఇక బ్రహ్మానందం గారి సెకండ్ ఇన్నింగ్స్ ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి.