
నందమూరి బాలకృష్ణ కూతురు బ్రహ్మీని గొప్ప వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన హెరిటేజ్ సంస్థ ని ప్రస్తుతం నడుపుతుంది బ్రహ్మీని గారే..దీనితో పాటు ఆమెకి ఎన్నో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి..నారా లోకేష్ ని పెళ్ళాడి ఒక బిడ్డకి జన్మనిచ్చిన బ్రహ్మీని లో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది అనే విషయం ఈమధ్యనే తెలిసింది.
అదేమిటి అంటే ఈమెకి బైక్ రైడింగ్ అంటే తెగ మక్కువట..ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్ లో ఆమెకి మెంబెర్ షిప్ కూడా ఉంది..లేటెస్ట్ గా ఆమె ఈమేల్హ్ ప్రాంతానికి బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్లినట్టు సమాచారం..సోషల్ మీడియా లో అభిమానులతో తరుచూ యాక్టీవ్ గా ఉండే బ్రహ్మీని ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు..అది చూసి నందమూరి అభిమానులు బాలయ్య బాబు కూతురా మజాకా అని కామెంట్స్ పెడుతున్నారు..ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.
బాలయ్య బాబు పెద్ద కూతురు బ్రహ్మీని మాత్రమే కాదు..చిన్న కూతురు తేజస్విని కూడా గొప్ప ప్రతిభావంతురాలు..ప్రస్తుతం బాలయ్య బాబు కెరీర్ ఇంత పీక్ లో కొనసాగుతుంది అంటే దానికి కారణం తేజస్విని..ఆహా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ని డిజైన్ చేసింది కూడా ఆమెనే..అంతే కాకుండా బాలయ్య బాబు ప్రస్తుతం కుర్ర డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి కూడా కారణం తేజస్వినియే..యూత్ కి బాలయ్య బాబు ని ఆమె బాగా చేరువ చేసింది.
బాలయ్య పని అయిపోయింది అని అనుకుంటున్న సమయం లో కెరీర్ ని ఒక్కసారిగా పైకి లేపింది తేజస్విని..అలా బాలయ్య బాబు ఇద్దరు కూతుర్లు ఎంతో ప్రతిభావంతులని..అలాంటి కూతుర్లు ఉండడం బాలయ్య బాబు అదృష్టమని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..ఇక బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం చేస్తున్నాడు..ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.