
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫామిలీ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇంజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన స్వయం కృషి తో అంచలంచలుగా ఎదుగుతూ ఎవ్వరికి అందనంత శిఖరాగ్ర స్థాయికి చేరుకోడమే కాకుండా తన కుటుంబ లో ఉన్న ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇచ్చాడు..ఆయన నీడ నుండి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని అనుభవిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నిస్వార్థంగా రాజకీయాలు చేస్తూ కోట్లాది మంది జనాలకు ఆసరాగా నిలిచాడు..పవన్ కళ్యాణ్ తర్వాత మెగా ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి పరిచయం అయిన రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్..నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి తెలుగువాడు గర్వపడే రేంజ్ కి ఎదిగారు..ఇక సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్ వంటి వారు కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ ని సాధించి యువ హీరోలలో దూసుకుపోతున్నారు..ఇలా వీరందరూ ఈరోజు ఈ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి మూల కారణం మెగాస్టార్ చిరంజీవి.
ఇక మెగా బ్రదర్ నాగబాబు తోలి నుండి హీరో గా కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా ఎదిగిన సంగతి మన అందరికి తెలిసిందే..అంతే కాకుండా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రుద్రవీణ వంటి జాతీయ అవార్డు సినిమాలను కూడా తీసి ఇండస్ట్రీ లో నిర్మాతగా నిలదొక్కుకున్నాడు..అయితే చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడవ సినిమా ఆరేంజ్ కి నిర్మాతగా వ్యవహరించి భారీ స్థాయి నష్టాలను చవి చూసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తెచ్చిన నష్టాలకు భారీ స్థాయిలో అప్పులపాలై ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాడు నాగబాబు..ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి ఆ నష్టాలను పూడ్చడం తో నాగబాబు నేడు మళ్ళీ కోలుకొని నేడు బుల్లితెర మీద మరియు వెండితెర మీద బిజీ గా గడుపుతున్నాడు..ఇక నాగ బాబు బుల్లితెర మీద ప్రసారం అయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన సంగతి మన అందరికి తెలిసిందే..జడ్జి గా మరియు నిర్మాతగా నాగబాబు కి బుల్లితెర మీద ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఇది ఇలా ఉండగా కేవలం బుల్లితెర షోస్ ద్వారా నాగబాబు ఇప్పటి వరుకు వంద కోట్ల రూపాయిల ఆస్తిని సమకూర్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఆర్థికంగా విపరీతంగా నష్టబొయ్యి నేడు వంద కోట్ల రూపాయిల ఆస్తులను కేవలం తన పేరు మీద సమకూర్చుకున్నారు అంటే నాగబాబు గ్రాఫ్ గడిచిన దశాబ్ద కాలం నుండి ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..ముఖ్యంగా జబర్దస్త్ షో నాగబాబు ని సరైన సమయం లో ఆదుకుంది అనే చెప్పొచ్చు..ఈ షో తర్వాత నుండే ఆయన ఆర్థికంగా కూడా బాగా పుంజుకున్నాడు..ఇక జీ తెలుగు లో అదిరింది అనే షోకి నిర్మాతగా వ్యవహరించి మంచి లాభాలను కూడా అందుకున్నాడు నాగబాబు..ఇక యూట్యూబ్ లో నాగబాబు ఒరిజినల్స్ అనే ఛానల్ ని ప్రారంబించి కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నాడు..వీటికి కూడా పిచ్చ క్రేజ్ ఉంది అనే చెప్పాలి.