
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా సుధీర్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ షో ద్వారానే సుధీర్‌కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్తుంటారు. కానీ సుధీర్ మాత్రం పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్న చందాన వ్యవహరించాడు. తనకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిన జబర్దస్త్ షోను వదిలేశాడు.రెమ్యునరేషన్ కోసం ఈటీవీని వీడి మాటీవీకి జంప్ అయ్యాడు. దీంతో సుధీర్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మాటీవీలో సూపర్ సింగర్ జూనియర్ షోకు సుధీర్ యాంకర్‌గా చేశాడు. అలాగే ఈ షోకు అనసూయ భరద్వాజ్ కూడా హోస్టుగా వ్యవహరించింది. అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కనిపించకుండా వెళ్లిపోయాడు.
తొలుత మేజిక్ షోలు చేసుకుంటూ కెరీర్‌ను మొదలు పెట్టిన సుధీర్ అదృష్టం బాగుండి జబర్ధస్త్ షోలోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో ప్రారంభంలోనే తనదైన శైలిలో మెప్పించిన అతడు కొద్ది రోజులకే టీమ్ లీడర్ అయిపోయాడు. దాదాపు 8 ఏళ్లుగా జబర్దస్త్ షో చేస్తూనే సమాంతరంగా ఈటీవీలో వివిధ ఈవెంట్లు, కార్యక్రమాలకు కూడా సుధీర్ చేశాడు. మధ్యలో సినిమా అవకాశాలు వచ్చినా అతడు బబర్దస్త్ షోను మాత్రం వీడలేదు. సుధీర్ హీరోగా మారి నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో అతడు మళ్లీ టీవీ షోలతోనే కాలం నెట్టుకొస్తున్నాడు. అయితే అత్యాశ మనిషిని పాతాళంలోకి నెట్టినట్లు సుధీర్‌కు అధిక రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చేసరికి ఈటీవీని వదిలేసినట్లు ప్రచారం జరిగింది.
కట్ చేస్తే ఇప్పుడు సుడిగాలి సుధీర్ బిగ్‌బాస్ సీజన్ 6లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్‌ను వీడినా సుధీర్‌పై అందరికీ కాస్తో కూస్తో అభిమానం ఉంది. ముఖ్యంగా సుధీర్ కంటూ ఒక అభిమాన సంఘమే ఉంది. సుధీర్‌ను హౌస్‌లోకి పంపితే వినోదానికి వినోదం, రేటింగ్‌కు రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ వేశారు. అయితే ఇప్పటికే హౌస్‌లో ఇద్దరు జబర్దస్త్ నటులు చంటి, ఫైమా ఉన్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలో కూడా జబర్దస్త్ నటుడినే పంపిస్తే ఎలా అని.. ఇంకెవరైనా సీనియర్ నటుడిని పంపిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అటు ఈ సీజన్‌లో జనాలకు తెలిసిన వారు ఎవరు లేకపోవడం బిగ్‌బాస్ షోకు మైనస్‌గా మారింది. హౌస్‌లో ఉన్న చాలా మందికి ఆట ఆడడం సరిగ్గా రాకపోవడం. గేమ్ మీద ఫోకస్ చేయడం తెలియకపోవడం, ఒకరిపై ఒకరు పర్సనల్ గ్రడ్జ్‌ను పెట్టుకుని పదే పదే వాటి గురించే ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తున్నారు.దీంతో ఫేమ్ ఉన్న నటుడిని హౌస్‌లోకి పంపితే బాగుంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.