Home Movie News బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్ కి అభిమానులు ఎలాంటి స్వాగతం పలికారో చూడండి

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్ కి అభిమానులు ఎలాంటి స్వాగతం పలికారో చూడండి

0 second read
0
0
1,367

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు, ఒక్క రియాలిటీ షో కి అన్ని వర్గాల ప్రేక్షకులు టీవీలకు అట్టుకుపొయ్యి చూసేలా చేసిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇప్పటి వరుకు మూడు సీసన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో మూడు సీసన్స్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో నాల్గవ సీసన్ కూడా అదే స్థాయిలో సంచలన విజయం సాధించింది, 16 మంది ఇంటి సభ్యులతో సుమారు 15 వారల పాటు సాగిన ఈ బిగ్గెట్ రియాలిటీ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, గడిచిన మూడు సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ గొప్ప సెలబ్రిటీస్ కాకపోయినా ఈ షో ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే పబ్లిక్ లో బిగ్ బాస్ షో సంపాదించుకున్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు, ముందు సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్కుకి కంటెస్టెంట్స్ నూటికి నూరు శాతం తమ కృషి ని పెట్టి ఆడి ఈరోజు ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమకంటూ ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నారు.

ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరో గా నటించిన అభిజీత్ హీరో గా ఇండస్ట్రీ ల పెద్దగా రాణించలేకపొయ్యాడు అనే చెప్పాలి, ఆయన నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా ఆడిన ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఎందుకో ఆశించిన స్థాయిలో ఆడలేదు, ఇక ఆ తర్వాత ఆయన బుల్లితెర స్టార్ యాంకర్ వర్షిణి తో కలిసి పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ చేసాడు, ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించిన కూడా అభిజీత్ అంటే అందరూ అప్పట్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అనే గుర్తించేవారు ,కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అభిజీత్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, కూల్ ఆటిట్యూడ్ తో ఆడుతున్న అతని ఆట తీరు తోలి రోజు నుండే అందరిని ఆకర్షించింది, అదే స్వబవం తో తెలివిగా ఆటలు ఆడుతూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు అభిజీత్, దీనితో ఆయన బిగ్ బాస్ సీసన్ టైటిల్ ని జనాల నుండి ఏకపక్షం తీర్పు తో గెలుపొందాడు, మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అభిజీత్ తన కెరీర్ ని ఎలా మలుచుకోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీసన్ 4 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సీసన్ టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలవగా, ఆయన తర్వాత దాదాపుగా అదే స్థాయి ఆదరాభిమానాలు పొందిన సోహెల్ రెండవ స్థానం లో నిలిచారు, ఇక తోలి నుండి టాస్క్ అంటే చెలరేగిపొయ్యి ఆడే అరియానా గ్రాఫ్ గత రెండు మూడు వారల నుండి ఒక్క రేంజ్ లో పెరిగిపోయింది అనే చెప్పాలి, దాని ఫలితం ఆమెని ఈరోజు టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచేలా చేసింది, ఇక హౌస్ లో టాస్కులను బాగా ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగి ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న అఖిల్ నాల్గవ స్థానం లో నిలవగా, హారిక టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది, బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న అభిజీత్ అభిమానుల సంబరాలు ఆకాశాన్ని అంటాయి అనే చెప్పాలి , అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఆయన ఇంటి వరుకు అభిజీత్ కి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…