
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీసన్ 6 ఇప్పుడు ఆరవ వారం లోకి దిగ్విజయంగా అడుగు పెట్టింది..ఈ సీసన్ ప్రారంభం లో ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించి TRP రేటింగ్స్ విషయం లో దారుణంగా పడిపోయింది..కానీ మూడవ వారం నుండి టాస్కుల విషయం లో పలు జాగ్రత్తలు పాటించింది బిగ్ బాస్ టీం..ఆసక్తికరమైన టాస్కులను డిజైన్ చేసి TRP రేటింగ్స్ ని భారీగా పెంచే ప్రయత్నం చేసింది..ఆ ప్రయత్నం లో బిగ్ బాస్ టీం నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి..మూడవ వారం నుండి TRP రేటింగ్స్ అంచలంచలుగా పెరుగుతూ ఇప్పుడు ఆరవ వారం కి రికార్డు స్థాయి రేటింగ్స్ ని నమోదు చేసుకొని ముందుకి దూసుకుపోతుంది..అయితే ఇప్పుడు ప్రేక్షకులు ఎప్పటి నుండో వైల్డ్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..గత సీసన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ లేకపోవడంతో,ఈ సీసన్ లో కచ్చితంగా ఉంటుంది అని సోషల్ మీడియా లో ఈ షో ప్రారంభమైన రోజు నుండే వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి.
అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రార్థి సీసన్ లో నాల్గవ వారం నుండి ఉంటూ వచ్చింది..ఇప్పుడు బిగ్ బాస్ ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారం లోకి అడుగుపెట్టినా కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఊసే లేకపోవడం తో ఈ సీసన్ లో కూడా వైల్డు కార్డు ఎంట్రీ లేనట్టేనా అని అభిమానులు నిరాశకి గురైయ్యారు..అలాంటి అభిమానులకు శుభవార్త..వచ్చే వారం వైల్డ్ కార్డు ఎంట్రీ తప్పనిసరిగా ఉంటుందట..ఈ వైల్డు కార్డు ఎంట్రీ ద్వారా బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా తిరుగులేని స్టార్ ఇమేజి ని దక్కించుకున్న సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతారట..ఎంటర్టైన్మెంట్ షోస్ తో ఎప్పుడూ బిజీ గా ఉండే సుధీర్ గత కొంత కాలం నుండి టీవీ షోలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..కారణం ఏమిటి అనేది ఎవరికీ తెలియకపోయిన ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ ఆయన బుల్లితెర పై గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు రావడం తో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే బిగ్ బాస్ సీసన్ 2 లో కూడా ఇలాగే యాంకర్ ప్రదీప్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ ఉంది వెళ్ళిపోయాడు..సుడిగాలి సుధీర్ కూడా అలాగే వచ్చి వెళ్తాడా, లేదా రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోనే ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది..ఒకవేళ సుడిగాలి సుధీర్ రెగ్యులర్ కంటెస్టెంట్ గా మాత్రం ఉంటె ఆయనకే బిగ్ బాస్ టైటిల్ వస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు..ఎందుకంటే సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ లేదు అని చెప్పొచ్చు..కాబట్టి యాంకర్ ప్రదీప్ లాగానే కేవలం ఒక రోజు ఉండి వెళ్ళిపోతాడని నెటిజెన్స్ అంటున్నారు..మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.