Home Entertainment బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పాత కంటెస్టెంట్..అది ఎవరో మీరే చూడండి

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పాత కంటెస్టెంట్..అది ఎవరో మీరే చూడండి

0 second read
0
0
312

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం ఈ రియాలిటీ షో వల్ల మన స్టార్ మా ఛానల్ ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా కొనసాగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు,ఇప్పటి వరుకు మన తెలుగు లో ప్రసారం అయినా ప్రతి సీసన్ బంపర్ హిట్ అయ్యింది, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభం అయినా మొదటి సీసన్ కి రికార్డు రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ రాగా,ఆ తర్వాత సీసన్ 2 కి కూడా అదే స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి, ఇక మూడవ సీసన్ నుండి నేడు 5 వ సీసన్ వరుకు కొనసాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి అక్కినేని నాగార్జున గారే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు, ఒక్క సీసన్ కి మించి మరొక్క సీసన్ ఘానా విజయం సాధిస్తూ ఈ రియాలిటీ షో కోసం ప్రతి ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసేలా చేసింది, ఇక సీసన్ 5 భారీ అంచనాల నడుమ ప్రసారం అయ్యి అది కూడా రికార్డు టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక ఈ షో ప్రారంభం అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది,16 మంది ఇంటి సభ్యులతో ప్రారంభం అయినా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు కేవలం 10 ఇంటి సభ్యులతో నడుస్తుంది, ఇప్పటి వరుకు హౌస్ నుండి ఉమా దేవి,సరయు,లహరి షెరి, నటరాజ్ మాస్టర్ , హమీద మరియు ప్రియా వంటి కంటెస్టెంట్స్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు, అయితే వీరిలో ఒక్క ఇంటి సభ్యుడిని ఆడియన్స్ పోల్ ద్వారా హౌస్ లోకి మల్లి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే విధంగా బోగ్ బాస్ సరికొత్త ప్లాన్ చేస్తున్నాడు అట, అనగా ఇప్పటి వరుకు ఎలిమినేట్ అయినా ఇంటి సభ్యులందరినీ ఒక్క ఆన్లైన్ పోల్ లో పెట్టి ఎవరికీ అయితే ఎక్కివ ఓట్లు వస్తాయో వారిని మల్లి తిరిగి హౌస్ లోకి పంపబోతున్నారు అట, గతం లో ఇలాగె బిగ్ బాస్ సీసన్ 2 లో చేసారు, అప్పట్లో ఎలిమినేట్ అయినా ఇంటి సభ్యులను పోల్ లో పెట్టి అత్యధిక ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ శ్యామల గారిని హౌస్ లోకి పంపారు, సరిగ్గా అలాంటి పద్దతిని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఉపయోగించబోతున్నాడు, మరి ఎలిమినేట్ అయినా ఆ ఇంటి సభ్యులలో ఎవరు తిరిగి మళ్ళీ హౌస్ లోకి రాబోతున్నారో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

ఇక ఈ వారం నామినేషన్స్ ఎంతో భావోద్వేగాల మధ్య జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, హౌస్ నుండి బయటకి వెళ్లడానికి షణ్ముఖ్ జస్వంత్ , సిరి, లోబో , మానస్, శ్రీ రామ చంద్ర మరియు రవి వంటి వారు నామినేట్ అవ్వగా, వీరిలో అత్యధిక ఓట్లతో షణ్ముఖ్ జస్వంత్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నాడు, ఇక ఆయన తర్వాతి స్థానం లో శ్రీ రామ చంద్ర నిలబడగా మూడవ స్థానం లో మానస్ ఉన్నాడు,ఇక సిరి నాల్గవ స్థానం లో కొనసాగుతుండగా, అయిదవ స్థానం లో రవి మరియు ఆరవ స్థానం లో లోబో కొనసాగుతున్నారు,అంటే ఈ వారం ఎలిమినేట్ అవ్వబొయ్యే కోనెటస్టెంట్ లోబో అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం,ఇక ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే అన్ని సీసన్స్ లాగానే ఈ సీసన్ లో కూడా రెండు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి అని తెలుస్తోంది, ఈ వారం లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా యాంకర్ వర్షిణి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం, ఇక ఆ అత్డుపరి వారం లో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిన ఒక్క కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొని రాబోతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…