
ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరూ ఊహించని ఎలిమినేషన్ జరిగింది..ఈ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ పని ఇక అయిపోయింది అనుకోవచ్చు..ఎందుకంటే అత్యధిక ఓట్లతో టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న ఇనాయ ని ఓట్లు బాగా వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ అయ్యేలా చెయ్యడం ఈ షో పై జనాల్లో నమ్మకం కోల్పోయ్యేలా చేసింది..ఆ ప్రభావం రాబొయ్యే సీజన్ మీద కూడా పడే అవకాశం ఎంతైనా ఉంది..రాబొయ్యే సీజన్ ని జనాలు చూడాలంటె కచ్చితంగా అన్నీ మారాల్సిందే..హోస్ట్ దగ్గర నుండి..కంటెస్టెంట్స్ వరుకు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే రేంజ్ ఉన్న వాళ్ళని తదుపరి సీజన్ లో తీసుకోవాలి..లేకపోతే ఇదే చివరి సీజన్ గా పరిగణించొచ్చు..ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఇనాయ బయటకి రాగానే చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘పెద్ద పాపులారిటీ లేని నాకు..బిగ్ బాస్ రియాలిటీ షో ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది..మొదటి వారమే ఎలిమినేట్ ఐపోతానేమో అని భయపడిన నన్ను నా ఆటతీరుని నచ్చి ఇంత దూరం తీసుకొని రావడం అంటే మాములు విషయం కాదు..బయటకి వచ్చిన తర్వాత నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమని చూసి నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి..చాలా మంది నాది ‘అన్ ఫెయిర్’ ఎలిమినేషన్..నాకు టాప్ 2 రేంజ్ ఓట్లు వచ్చాయి అని అంటూ ఉన్నారు..అలాంటివేమీ నేను ఇంకా గమనించలేదు..ఒకవేళ నన్ను బిగ్ బాస్ టీం వాళ్ళు కావాలనే తొలగించాలి అనే ఉద్దేశ్యమే ఉంటే ఇన్ని రోజులు నేను హౌస్ లో కొనసాగాను కదా..హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ఈ షో లోకి అడుగుపెట్టకముందు నుండే ఫ్యాన్ బేస్ ఉంది..నాకు ఈ షో లోకి వచ్చిన తర్వాతే పేరు వచ్చింది..వాళ్లకి ఆ ప్రీ ఫ్యాన్ బేస్ బాగా ఉపయోగపడింది..నాకు అది లేదు కాబట్టే ఈరోజు నేను బయట ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఇనాయ.
ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని నాగార్జున నిన్న జరిగిన ఎపిసోడ్ లోనే చెప్తాడు..అంటే బుధవారం ఒకరిని హౌస్ నుండి బయటకి పంపేయబోతున్నారు అన్నమాట..ఆదివారం అర్థరాత్రి నుండి బుధవారం వరుకు జరిగే పోలింగ్ లో ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అయ్యిపోతారని నాగార్జున ఈ సందర్భంగా తెలిపాడు..డేంజర్ లో ఆది రెడ్డి , శ్రీ సత్య మరియు కీర్తి ఉన్నారు..వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఆది రెడ్డి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..ఇక టాప్ 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి..రేవంత్ , శ్రీహన్ , రోహిత్ లు టాప్ 3 రేస్ లో ఉన్నారు..వీరిలో ఎవరు టైటిల్ గెలిచి 50 లక్షల రూపాయిల నగదు..25 లక్షల రూపాయిల ఇల్లు మరియు కార్ గెలుచుకోబోతున్నారో చూడాలి.