
బుల్లితెర ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్ సరికొత్త సీసన్ ఇటీవలే ప్రారంభమైన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు నుండే ఆసక్తికరమైన టాస్కులతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు..ఈ సినిమాకి ఇప్పుడు TRP రేటింగ్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి..ప్రతి రోజు పది గంటలకు ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షో అప్పుడే మొదటి వారం ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక ఎలిమినేషన్ ని కూడా జరుపుకుంది..ఈ వారం వోటింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటె బిగ్ బాస్ హౌస్ నుండి ఇనాయ సుల్తానా ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది..ఈ వారం నామినేషన్స్ లో రేవంత్ , ఇనాయ సుల్తానా , శ్రీ సత్య, చలాకి చంటి , ఆరోహి రావు మరియు ఫైమా వంటి వారి నామినేట్ అవ్వగా..వారిలో రేవంత్ అత్యధిక ఓట్లతో టాప్ 1 స్థానం లో నిలబడగా,ఇనాయ సుల్తానా అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యింది.
హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఇనాయ సుల్తానా ఇంటి సభ్యులతో ఎదో ఒక విషయం లో గొడవ పడడం, ఆ తర్వాత నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు, ఒంటరి గా వచ్చాను అంటూ పదే పదే చెప్పడం ఆడియన్స్ కి కాస్త చిరాకు కలిగినట్టు అనిపిస్తుంది..అందుకే ఆమె ని ప్రేక్షకులు ఆదరించలేదు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు..ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ కానుంది..ఇనాయ సుల్తానా కంటే స్వల్పమైన ఓట్ల తేడా అభినయ శ్రీ ముందు ఉంది..ఈమె హౌస్ లో ఉందొ లేదో అనే విషయం చాలా మందికి తెలీదు..ఇలాగె ఉంటూ ఈసారి నామినేషన్స్ కి వస్తే మాత్రం ఈమె ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటి అంటున్నారు విశ్లేషకులు..ఇక హౌస్ లో అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ ముందు ఉన్నాడు..మొదటి రోజు నుండే ఇతగాడు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో సఫలం అయ్యాడు..టాస్కులు బాగా ఆడడమే కాకుండా ఆయనకీ ఉన్న పాపులారిటీ కూడా ఆయనని నెంబర్ 1 స్థానం లో నిలబెట్టింది అని చెప్పొచ్చు.
ఇక రెండవ స్థానం లో జబర్దస్త్ ఆర్టిస్టు ఫైమా ఉంది..ఈమెకి కూడా హౌస్ లోకి అడుగుపెట్టాక ముందు నుండే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ ఉంది..ఆ పాపులారిటీ వల్ల ఈమెకి కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పొచ్చు..రెండవ వారం నుండి ఇది మారొచ్చు కూడా..ఇక మూడవ స్థానం లో శ్రీ సత్య ఉండగా,నాల్గవ స్థానం లో చలాకి చంటి, ఐదవ స్థానం లో ఆరోహి రావు కొనసాగుతున్నారు..మొదటి వారం లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో సరికొత్త సీసన్..రెండవ వారం నుండి ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ షో ని ఇప్పుడు డిస్నీ + హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ చూడొచ్చు..రోజు టీవీ లో చూపించని వీడియో ఫ్యూటేజ్ కూడా ఇందులో మనం చూడొచ్చు.