
ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎవ్వరి అంచనాలకు అందకుండా ఊహించని ట్విస్టులతో ముందుకి సాగిపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయం లో గత కొద్ది వారల నుండి సోషల్ మీడియా లో జరిగే అనధికారిక పోలింగ్ ఫలితాలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నాయి..గడిచిన సీజన్స్ అన్ని కూడా సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలే దాదాపుగా నిజం అయ్యేవి..కానీ ఈ సీజన్ అందుకు పూర్తిగా విరుద్ధం..ఎలిమినేషన్స్ విషయం లో ప్రేక్షకులు ముందుగానే తెలుసుకుంటున్నారు అని ఏమో తెలియదు కానీ బిగ్ బాస్ టీం ఆడియన్స్ అభిరుచి కి పూర్తి విరుద్ధంగా ఎలిమనషన్స్ చేస్తున్నారు..ఇందువల్ల బిగ్ బాస్ పై ఆడియన్స్ లో నెగటివిటీ మాములు రేంజ్ లో రాలేదు..ఇక ఈ వారం కూడా అలాంటి ఎలిమినేషన్ జరగబోతుందని తెలుస్తుంది..వోటింగ్స్ ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరికంటే ఆది రెడ్డి కి మరియు ఫైమా కే అతి తక్కువ ఓట్లు వచ్చాయి.
‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ఫైమా కి ఉండడం వల్ల ఆమె ఎలిమినేషన్ నుండి తప్పించుకోబోతుంది..కానీ పాపం ఆది రెడ్డి ఆమెకి ముందు డేంజర్ జోన్ లో ఉండడం వల్ల అతను ఎలిమినేట్ అవ్వక తప్పేలా లేదు..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి అద్భుతంగా ఫిజికల్ టాస్కులు ఆడడమే కాదు..తన తోటి ఇంటి సభ్యులతో కూడా ఎంతో మంచి నడవిక తో నడుచుకునే ఆది రెడ్డి ఎలిమినేషన్ కి గురైతే ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షో పై మరింత నెగటివిటీ పెరిగే అవకాశం ఉంది..అయితే ఫైమా ఆది రెడ్డి కి బాగా క్లోజ్ అవ్వడం వల్ల ఆ ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ వాడి ఆది రెడ్డి ని సేఫ్ చేసే అవకాశం ఉంది..కానీ ఫైమా కూడా డేంజర్ జోన్ లో ఉండడం వల్ల ఆమె ఆ పాస్ ని తనకి ఉపయోగించుకోబోతుంది..దీనితో ఆది రెడ్డి ఎలిమినేట్ అవ్వక తప్పేటట్టు లేదు.
ఒకవేళ ఫైమా రాబొయ్యే రెండు రోజుల్లో తన ఆట తీరుని మార్చుకొని తన గ్రాఫ్ ని అమాంతం పెంచేసి నామినేషన్స్ నుండి ముందుగా సేఫ్ అయితే ఆది రెడ్డి ని ఆమె కాపాడే అవకాశం ఉంది..చూడాలిమరి బిగ్ బాస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరు ఊహించలేరు అనేది ఇందుకే..ఏవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కుని చాలా తేలికగా తీసుకోవడం వల్ల టాప్ 5 లో ఉండే అర్హత ఉన్న ఆది రెడ్డి డేంజర్ జోన్ లో వచ్చే రేంజ్ లో ఆయన గ్రాఫ్ దిగజారిపోయింది..రాబొయ్యే రోజుల్లో తన ఆట తీరుని మార్చుకొని ఆది రెడ్డి డేంజర్ జోన్ నుండి బయటపడుతాడా లేదా అనేది చూడాలి..నిన్న బిగ్ బాస్ ఇచ్చిన ‘బిగ్ బాస్ కోచింగ్ సెంటర్’ టాస్కులో ఆదిరెడ్డి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించాడు..దీనితో పాటు ఆయన భార్య కవిత మరియు కూతురు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వెళ్లడం అందరిని బాగా ఎమోషనల్ కి గురి చేసింది..మరి ఈ ఎమోషన్ వల్ల ఆది రెడ్డి కి ఓట్లు పడతాయా లేదా అనేది చూడాలి.