
బిగ్‌బాస్-6 తెలుగు సీజన్ మూడో వారాంతానికి చేరుకుంది. రెండో వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లారు. అభినయశ్రీ, షానీ ఇద్దరిని ఒకే వారం బయటకు పంపడంతో మిగతా కంటెస్టెంట్లు ఆశ్చర్యానికి గురయ్యారు. మరి మూడో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఈ వారం నామినేషన్‌లలో మంది ఉన్నారు. బాలాదిత్య, నేహా, గీతూ, రేవంత్, శ్రీహన్, చలాకీ చంటి, సుదీప, ఆరోహి, ఇనయా సుల్తానా నామినేషన్‌లలో ఉన్నారు. వీరిలో బాలాదిత్య, నేహా, గీతూ, రేవంత్ , శ్రీహన్, చలాకీ చంటి టాప్‌లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్‌లో సుదీప, ఆరోహి, ఇనయా సుల్తానా ఉన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్నవారిలో ఇనయా సుల్తానాకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అటు మూడో వారంలో కెప్టెన్‌గా ఆదిరెడ్డి ఎంపికయ్యాడు. రెండో వారం కెప్టెన్‌గా రాజ్ వ్యవహరించగా.. ఈ వారం టాస్కుల్లో గెలిచి ఆదిరెడ్డి కెప్టెన్ అయ్యాడు. ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన అడవిలో ఆట టాస్కు గందరగోళంగా సాగింది. పోలీసులు, దొంగల మధ్య ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా నడిచింది. అయితే మొత్తానికి పోలీసుల టీమ్ గెలిచింది. దీంతో పోలీసుల టీమ్‌లో ముగ్గురు కెప్టెన్ కంటెండర్ అయ్యారు. వీరిలో ఆదిరెడ్డి, ఫైమా, ఆర్జే సూర్య ఉన్నారు. గీతూ, శ్రీసత్యను బిగ్‌బాస్ నేరుగా కంటెండర్లను చేశాడు. దొంగల టీమ్ నుంచి శ్రీహాన్ ఎంపికయ్యాడు. అటు కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ రెండు టాస్కులను ఇచ్చాడు. అయితే పిరమిడ్ టాస్కు నుంచి శ్రీహాన్, ఫైమా వైదొలిగారు. రెండో టాస్కు కోసం ముగ్గురు మాత్రమే మిగిలారు. వీరికి ఎత్తెర జెండా అనే టాస్కును నిర్వహించారు. ఇందులో భాగంగా ఇసుక కుప్పలో నుంచి ఇసుకను ఓ చిన్న బకెట్‌లో తీసుకెళ్లి వాళ్లకు కేటాయించిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది.
అయితే రెండో టాస్కులో ఆదిరెడ్డి చాలా వేగంగా ఇసుకను డబ్బాలో వేయడంతో అతడి జెండా ముందుగా పైకి లేచింది. శ్రీహాన్ గెలుపుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోతాడు. దీంతో అతడు కుమిలిపోతాడు. మరోవైపు డేంజర్ జోన్‌లో వాసంతి తాను ఎలిమినేట్ అవుతానేమోనని భయపడుతుంది. ఇనయాతో ఇదే విషయాన్ని ఆమె చర్చిస్తుంది. అటు ఈ వారం ఎవరు ఎంతసేపు కనిపించారన్న విషయంపై బిగ్‌బాస్ ఓటింగ్ నిర్వహించగా 10 నిమిషాల ట్యాగ్‌ను అందరూ గీతూకు ఇచ్చారు. రేవంత్ 7 నిమిషాల ట్యాగ్ గెలుచుకోగా ఫైమా 6 నిమిషాల ట్యాగ్ సొంతం చేసుకుంది. శ్రీహాన్, ఇనయాలు 5 నిమిషాల చైన్ ధరిస్తారు. తనకు జీరో చైన్ ఇచ్చినందుకు కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ కన్నీటి పర్యంతం అవుతుంది. జీరో మినిట్స్ ట్యాగ్ మరో ఇద్దరికి కూడా ఇచ్చారు. అర్జున్ కళ్యాణ్, ఆరోహిలకు కూడా ఇదే ట్యాగ్ వచ్చింది. వీరిలో అర్జున్ కళ్యాణ్ జైలుకు వెళ్లాడు.