
ఇటీవల కాలం లో తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ నాలగవ సీసన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు అనే చెప్పాలి, ప్రతి రోజు రికార్డు లెవెల్ టీ ఆర్ పీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిపింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గొప్ప సెలెబ్రిటీలు కాకపోయినా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను మొదటి రోజు నుండే అత్యద్భుతంగా ఆడుతూ ప్రేక్షకుల్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమకంటూ ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు, సుమారు 15 వారల పాటు కొనసాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే మొన్న ఆదివారం ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరు అయినా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజీత్ టైటిల్ మరియు ప్రైజ్ మనీ ని గెలుచుకున్నారు.
ఇక ఈ గ్రాండ్ ఫినాలే లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఎవరో ఒక్కరు 25 లక్షల్లో రూపాయిలు తీసుకొని బయటకి వచ్చేయొచ్చు అని బిగ్ బాస్ ఇచ్చిన అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకున్న సోహెల్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు,తానూ గెలిచినా పాతిక లక్షల రూపాయలలో 10 లక్షల రూపాయిలను పెద్దవాళ్ళకి డొనేషన్ చేస్తాను అని చెప్పి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలతో పాటు అక్కడకి ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగా స్టార్ చిరంజీవి మనసుని కూడా గెలుచుకున్నాడు సోహెల్, మెగాస్టార్ చిరంజీవి ఇతనితో జరిపిన సంభాషణ హైలెట్ గా నిలిచింది, సోహెల్ కోసం తన సతీమణి సురేఖ చేత ప్రత్యేకంగా బిర్యాని చేయించి తీసుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి, దానితో పాటు సోహెల్ తానూ తియ్యబోయ్యే సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే మీరు కచ్చితంగా వచ్చి సపోర్ట్ చెయ్యాలి అని అడగగా తప్పకుండ వస్తాడు, కుదిరితే నాకు ఆ సినిమాలో ఒక్క చిన్న గెస్ట్ రోల్ ఇవ్వు నేను చేస్తాను అంటూ సోహెల్ కి వరాల జల్లు కురిపించాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక సోహెల్ కి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోహెల్ కి ఒక్క బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియా ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పవన్ కళ్యాణ్ తన తదుపరి సినెమాలలలో కుదిరితే ఎదో ఒక్క మంచి రోల్ చేయించామని రికమెండ్ చెయ్యడం పవన్ కళ్యాణ్ మారు ఆలోచించకుండా ఓకే చూపినట్టు సమాచారం, ఇదే కనుక నిజం అయితే సోహెల్ కి టాలీవుడ్ లో దశ తిరగబోతుంది అనే చెప్పొచ్చు, తానూ ఇండస్ట్రీ నుండి ఎంతోకాలం నుండి ఉంటున్న కూడా సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బందులు పడ్డాను అని, ఈ బిగ్ బాస్ షో తనకి ఊపిరి ని ఇచ్చింది అని,బిగ్ బాస్ ద్వారా వచ్చిన అద్భుతమైన ఫేమ్ తో కచ్చితంగా నేను ఇప్పుడు సినిమా తీసి ఎలా అయినా హిట్ కొడతాను అని సోహెల్ పలు సందర్భాలలో చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, మరి ఆయన ఫేట్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.