
ప్రతి బిగ్ బాస్ సీజన్ లో మనం అంతవరుకు ఎప్పుడు చూడని ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ షో ద్వారా దగ్గరై ప్రేక్షాభిమానాలు పొందుతూ ఉంటారు..సినీ కెరీర్ లో సక్సెస్ కానీ ఎంతో మందికి బంగారం లాంటి అవకాశం కల్పించింది బిగ్ బాస్ షో..ఆలా ఒక రేడియో జాకీ గా కొనసాగుతూ తన మిమిక్రీ టాలెంట్ తో అలరిస్తూ వచ్చిన సూర్య బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు..కొన్ని అనుకోని పరిస్థితులలో అతను ఎలిమినేట్ అయ్యినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచడం లో సూర్య నూటికి నూరుపాళ్లు సక్సెస్ సాధించాడు..అనుకున్న విధంగానే లక్షలాది మంది అభిమానుల ఆదరణను దక్కించుకున్నాడు..ఇక బిగ్ బాస్ షో ద్వారా సూర్య ఒక ఫెమినిస్ట్ అనే విషయం కూడా బయటపడింది..ఆడవాళ్ళకి ఏ మాత్రం నోచుకోకుండా అతను ప్రవర్తించిన తీరు అందరికి నచ్చింది..కానీ అదే ఆయన పాలిట శాపంలాగా మారింది కూడా..ఎక్కువగా అమ్మాయిలతోనే ఉండడం తో ఫెమినిస్ట్ అనేది కాస్త ప్రేక్షకులకు వేరే విధంగా అర్థం అయ్యి అతనిని హౌస్ నుండి బయటకి పంపేశారు.
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సూర్య అనేక ఇంటర్వూస్ ఇచ్చాడు..ఈ ఇంటర్వూస్ లో ఆయన తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని విషయాలను పంచుకున్నాడు..అవి వింటే ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పదు..తానూ చాలా పేదరిక కుటుంబం నుండి వచ్చానని..తల్లి బీడీలు కడితే,నాన్న తాపీ పనులు చేసేవాడని..ఆలా వాళ్లిద్దరూ నన్ను ఎంతో కస్టపడి చదివించారని..ఇప్పుడు నేను వాళ్ళు గర్వపడే స్థాయికి ఎదిగానని..భవిష్యత్తులో ఇంకా ఎత్తుకి ఎదగడమే నా గోల్ అంటూ చెప్పుకొచ్చాడు..అంతే కాకుండా చదువుకునే రోజుల్లో అతనికి ఉన్న ఒక లవ్ స్టోరీ గురించి చెప్పుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు సూర్య..ఎంబీఏ చేరిన కొత్తల్లోనే మనోడు ఒక అమ్మాయిని ప్రేమించాడట..మొదటి రోజు నుండే ఆ అమ్మాయిని ఫాలో అవుతూ మొత్తానికి ఆమెకి ప్రొపోజ్ చేసి ప్రేమాయణం అయితే విజయవంతంగా నడిపాడు..కానీ పెళ్లిదాకా వచ్చేసరికి పరిస్థితి మొత్తం పూర్తిగా బెడిసికొట్టేసింది..చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేఉస్కోవాలి..బ్రతికితే ఆ అమ్మాయితోనే కలిసి బ్రతకాలి అనేంత లోతుగా ఆ అమ్మాయిని ప్రేమించాడట సూర్య.
అయితే ఆ అమ్మాయి తల్లితండ్రులు సూర్య తో పెళ్ళికి అసలు ఒప్పుకోలేదు..దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన సూర్య ఆత్మహత్యాయత్నం చేసాడట..కొడుకు అలా బాధపడడం చూసి సూర్య తల్లి ఆ అమ్మాయి తల్లి తండ్రులతో మాట్లాడిందట..పెళ్ళికి వాళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఒప్పుకున్నారట..పిల్లలిద్దరు చదువు పూర్తి అయ్యేవరకు కలవకూడదు..మాట్లాడుకోకూడదు..అప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటె అప్పుడు పెళ్లి చేద్దాము అని ఆ అమ్మాయి తల్లితండ్రులు సూర్య తల్లితో చెప్పారట..ఇక ఎంబీఏ చదువు పూర్తైన తర్వాత ఆ అమ్మాయి సూర్య కి ఫోన్ చేసి మీ అమ్మగారు అలా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు..నువ్వు నిజంగానే నన్ను ప్రేమించి ఉంటె మీ అమ్మానాన్నల్ని వదిలేసి మా దగ్గరకి వచ్చాయి..మా ఇంట్లోనే ఉండు..నేను అయితే అక్కడకి రాను అని చెప్పిందట ఆ అమ్మాయి..ఆ మాటలకు సూర్య కోపం కట్టలు తెంచుకొని చేతిలో ఉన్న ఫోన్ ని నేలకేసి కొట్టి తన తల్లిగారి కాళ్ళని గట్టిగ పట్టుకొని ఏడ్చాడట..ఈ విషయం ఇంటర్వ్యూ లో చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు సూర్య.