
భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఆరంభం లో ఫ్లాప్ సీజన్ అని అనిపించుకున్నా..ఆ తర్వాత వారాల నుండి ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ప్రారంభం లో కనీసం 5 టీఆర్ఫీ రేటింగ్స్ కూడా రప్పించుకోలేకపోయిన ఈ సీజన్, ప్రస్తుతం రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది..అయితే గత కొద్దీ వారాల నుండి ఎలిమినేషన్స్ విషయం లో నెటిజెన్స్ దగ్గర నుండి తీవ్రమైన ఆరోపణలను ఎదురుకుంటుంది ఈ రియాలిటీ షో..హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ని బయటకి పంపడమే ప్రధాన అజెండానా?..అసలు ఈ షో ఎందుకు నిర్వహిస్తున్నారు లాంటి విమర్శలను ఎదురుకున్నారు బిగ్ బాస్ టీం..అర్జున్ కళ్యాణ్ , సూర్య , గీతూ వంటి కంటెస్టెంట్స్ టాప్ 5 లో ఉండడానికి అర్హులని..అలాంటి వారిని ఉంచకుండా హౌస్ లో ఆట రాణి వాళ్ళను ఉంచారంటూ కామెంట్స్ వచ్చాయి..అయితే ఈ నెగటివ్ కామెంట్స్ అన్నిటిని పరిశీలించిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టింది.
బాలాదిత్య మరియు మరీనా ని ఈ వారం బిగ్ బాస్ నుండి పంపేసి వాళ్ళ బదులు ఇద్దరు ఎలిమినేటైనా కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపబోతున్నట్టు తెలుస్తుంది..ఎలిమినేటైనా సభ్యులలలో నలుగురిని ఎంచుకొని వారిలో అత్యధిక ఓట్లు వచ్చిన టాప్ 2 కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు..బిగ్ బాస్ ఎంచుకున్న ఆ నలుగురు ఇంటి సభ్యులు గీతూ, సూర్య, అర్జున్ కళ్యాణ్ మరియు ఆరోహి రావు..వీళ్ళని పోలింగ్ లో పెట్టి ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో..వారిని హౌస్ లోకి పంపనున్నారు..బిగ్ బాస్ సీజన్ 2 లో ఇలాగె చేసారు..ఆ తర్వాత ఎలిమినేటైనా ఇంటి సభ్యులను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇప్పటి వరుకు లోపలకి పంపలేదు బిగ్ బాస్..మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన సీజన్ 6 ద్వారా ఆ కార్యక్రమం చేయనున్నాడు..అయితే వీరిలో ఎవరు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది విశ్లేషిస్తే.
అత్యధిక శాతం ఓట్లు గీతూ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి..ఎందుకంటే ఆమె ఎలిమినేషన్ అందరికి కంటతడి పెట్టించింది..మళ్ళీ ఆమె హౌస్ లోకి వస్తే బాగుండును అని కోరుకున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది..ఇక ఆమె తర్వాత అత్యధిక ఓట్లు పడే అవకాశం సూర్య కి ఉంది..హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఎంటర్టైన్మెంట్ పరంగా ..టాస్కులు ఆడడం పరంగా సూర్య అద్భుతంగా రాణించాడు..దానికి తోడు ఇనాయ ఫాన్స్ కూడా అతనికి ఫుల్లుగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది..వీరితో పాటుగా అర్జున్ కళ్యాణ్ కి కూడా హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది..ఎందుకంటే ఇతనికి రేవంత్ , శ్రీహాన్ ఫాన్స్ సపోర్టు బాగా ఉంటుంది..అంతే కాకుండా అతను ఎలిమినేట్ అయ్యే చివరి వారం లో టాస్కులలో తన విశ్వరూపం చూపించేసాడు..బాగా ఆడుతున్నాడు..టాప్ 5 లో స్థానం పక్కా అని అనుకుంటున్న సమయం లో అతని ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ని ఇచ్చింది..కాబట్టి ఇతనికి కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.