
బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ 9వ వారం కొనసాగుతోంది. ఈ వారం హౌస్‌లో ఉన్న 13 మందిలో 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. గీతూ, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఇనయా, బాలాదిత్య, రేవంత్, కీర్తి భట్ నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ సందర్భంగా ఫైమా-ఇనయా, రేవంత్-ఇనయా, శ్రీహాన్-కీర్తి, శ్రీహాన్-ఇనయా, బాలాదిత్య-ఫైమా మధ్య డిస్కషన్‌లు హౌస్‌లో వేడి పుట్టించాయి. నామినేషన్ ఎపిసోడ్‌లో ఫైమా వైఖరి చర్చనీయాంశంగా మారింది. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పినా ఫైమా వెటకారం తగ్గలేదు. పైగా ఇంకా పెరిగింది. అంతేకాకుండా వెటకారం ఎక్కువైతే కట్ చేసుకోండి బిగ్ బాస్ అంటూ ఫైమా అతి చేసింది. ఫైమాను బాలాదిత్య నామినేట్ చేసినప్పుడు ఆమె ప్రవర్తన బాగోలేదని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ వారం బిగ్‌బాస్ మిషన్ పాజిబుల్ అనే కంటెండెర్స్ టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సభ్యులందరూ రెడ్, బ్లూ టీములుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఏర్పడ్డారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయా, వాసంతి, మెరీనా, రోహిత్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఈ టాస్కులో భాగంగా సభ్యుల భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేస్తే అతడు చనిపోయినట్టే. దీంతో ఒకరు మీద ఒకరు పడి స్ట్రిప్పులు లాగుకున్నారు. అయితే కంటెండెర్ల టాస్కులో గీతూ ఎదుటివారి వీక్‌నెస్‌లపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే గీతూ ఒకసారి దొంగాట ఆడి బాలాదిత్యను స్మోకింగ్‌కు దూరం చేసింది. తాజా టాస్కులోనూ గీతూ అదే దారి ఎంచుకుంది. కన్నింగ్‌గా బాలాదిత్య వీక్‌నెస్‌పైనే దెబ్బకొట్టింది. శ్రీహాన్, శ్రీసత్య సహాయంతో బాలాదిత్య సిగరెట్లు, లైటర్ దొంగిలించి అతడిని ఏడిపించింది. దీంతో తన ఒక్కడి కోసం టీమ్ మొత్తాన్ని ఇబ్బందుల్లో పెట్టడం ఇష్టలేదని, బతిమిలాడుతున్నానని.. ఈ విషయం సీరియస్ చేయకుండా తన సిగరెట్లను ఇచ్చేయాలని గీతూను బాలాదిత్య హెచ్చరిస్తాడు. గీతూను చెల్లెలిలా భావించినందుకు రిగ్రెట్ అవుతున్నానంటూ ఫీలవుతాడు.
ఈ వారం టాస్క్ కారణంగా ఓటింగ్‌లో గీతూకు తక్కువ ఓట్లు వచ్చినట్లు కనిపిస్తోంది. సిగరెట్ సింపతీ బాలాదిత్యను కాపాడింది. అతడికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు పడినట్లు తెలుస్తోంది. శ్రీహాన్ నామినేషన్స్‌లో లేకపోవడం వల్ల అతడి ఓట్లు బాలాదిత్యకు పడ్డాయి. ఎప్పటిలా రేవంత్‌కు అత్యధిక ఓట్లు పడ్డాయి. ఇనయాకు కూడా ఈ వారం బాగానే ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. ఆమె సేఫ్ జోన్‌లోనే ఉంది. కీర్తి కూడా బాగానే ఆడటంతో ఆమె కూడా సేఫ్‌గానే కనిపిస్తోంది. అయితే ఆరుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. రోహిత్, ఫైమా, గీతూ, మెరీనా, శ్రీసత్య ఆదిరెడ్డి డేంజర్ పొజిషన్‌లో ఉన్నారు. వీరిలో టాస్క్ పెర్ఫార్మెన్‌ల ప్రకారం మెరీనా, శ్రీసత్య బాగానే ఆడారు. అయితే ఈ వారం రివ్యూవర్లు గీతూ, ఆదిరెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చి డబుల్ ఎలిమినేషన్ చేస్తే మెరీనా లేదా శ్రీసత్యలలో ఒకరు, గీతూ లేదా ఆదిరెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.