
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై 9 వారాలు పూర్తి చేసుకొని 10 వ వారం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రారంభం లో చాలా నత్తనడకన సాగిన ఈ రియాలిటీ షో రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈ వారం కెప్టెన్సీ టాస్కు ఎంత ఉత్కంఠ మధ్య కొనసాగిందో మన అందరం చూసాము..ఈ టాస్కులో ఇంటి సభ్యులందరు చెలరేగిపోయిమరీ ఆడారు..ఎన్నో భావోద్వేగాలు మరియు గొడవల నడుమ సాగిన ఈ కెప్టెన్సీ టాస్కు లో విజేతగా ఫైమా గెలిచి ఈ వారం ఇంటి కెప్టెన్ గా నిలిచింది..ఇది ఇలా ఉండగా అన్ని వారాలు లాగ కాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టు సమాచారం..ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైనా ఇంటి సభ్యులు ఫైమా, శ్రీహన్ , రేవంత్ , బాలాదిత్య , మరీనా,కీర్తి , ఇనాయ, ఆది రెడ్డి మరియు వాసంతి.
సోషల్ మీడియా లో జరిగే అనధికారిక పొలింగ్స్ అన్నిట్లో వాసంతి కి తక్కువ ఓట్లు వచ్చాయి..కానీ ఈ వారం బిగ్ బాస్ బాలాదిత్య ని మరియు మరీనా ని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం..మరీనా హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంది అనే దానిపై సోషల్ మీడియా లో పెద్దగా నెగటివిటీ లేదు కానీ..టాస్కులను బాగా ఆడే బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడం పై ఇంటి నెగటివిటీ విపరీతంగా ఏర్పడింది..ఈ వారం లో జరిగిన కెప్టెన్సీ టాస్కులో కూడా బాలాదిత్య అద్భుతంగా రాణించాడు..కానీ అతని ఎలిమినేషన్ ని మాత్రం అభిమానులు తీసుకోలేకున్నారు..గడిచిన అన్ని సీజన్స్ లో కూడా ప్రతివారం జరిగే ఎలిమినేషన్స్ సోషల్ మీడియా లో జరిగే అనధికారిక పోలింగ్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండేది..కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి..అర్జున్ కళ్యాణ్ , సూర్య మరియు గీతూ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం పై సోషల్ మీడియా లో ఎలాంటి విమర్శలు కురిసాయి మనం చూస్తూనే ఉన్నాము.
ఇక మరీనా విషయానికి వస్తే హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఈమె టాస్కులు పెద్దగా ఆడలేదు అనే విషయం వాస్తవమే..కానీ ఈమధ్య కాలం లో తన ఆటని చాలా బాగా మెరుగుపరుచుకుంది..కానీ ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఇంటి సభ్యులందరికంటే తక్కువ పెర్ఫార్మన్స్ ఇచ్చేది ఆమె అని చెప్పాలి..మరీనా ఎలిమినేషన్ రోహిత్ చాలా ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు..ఎందుకంటే మరీనా లేకపోతే ఆమెకి ఓట్లు వేసే ఫాన్స్ రోహిత్ కి వేస్తారు..అది రోహిత్ కి బాగా కలిసొచ్చే అంశం..అంతే కాకుండా టాస్కుల సమయం లో మరీనా మరియు రోహిత్ ప్రత్యర్థి టీమ్స్ గా ఉన్నప్పుడు రోహిత్ కి చాలా బాడ్ నేమ్ వచ్చేస్తుంది..ఎందుకంటే మరీనా ని ఓడించే ప్రయత్నాలు రోహిత్ అసలు చెయ్యడు..ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో కూడా అదే జరిగింది..మరీనా ని ఓడించేందుకు ఏ మాత్రం ప్రయత్నిమ్చకుండా చాలా సేఫ్ గా ఆయన గేమ్ ఆడాడు..ఇది చూసే వారి దృష్టిలో బాగా నెగటివ్ అయ్యింది..మరీనా లేకపోతే రోహిత్ ఆట చాలా మెరుగుపడుతుంది అనేది నెటిజెన్స్ అభిప్రాయం.