
తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటికి 5 సీసన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అతి త్వరలోనే ఆరవ సీసన్ కూడా ప్రారంబించుకోనుంది..ఇండస్ట్రీ పెద్దగా పేరు లేని సెలబ్రిటీస్ ఎంతోమంది ఈ గేమ్ షో లో ఆడి మంచి పాపులారిటీ ని దక్కించుకొని సినిమాల్లో ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు..అలాంటి వారిలో ఒక్కరే సన్నీ..ఇతగాడు బిగ్ బాస్ షో లోకి రాకముందు ఎవరికీ తెలియదు..ఎదో కొన్ని సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించాడు కానీ, పెద్దగా గుర్తింపు అయితే రాలేదు..కానీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత మొదటి రోజు నుండే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను అద్భుతంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు..చివరికి ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని దాటుకొని బిగ్ బాస్ 5 టైటిల్ ని సొంతం చేసుకొని 50 లక్షల రూపాయిల నగదు మరియు పాతిక లక్షల రూపాయిలు విలువ చేసే ఫ్లాట్ ని సొంతం చేసుకున్నాడు..ప్రస్తుతం ఇతగాడికి టాలీవుడ్ లో మంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.
ఇక్కడ వరుకు అంత బాగానే ఉంది..కానీ సన్నీ కి ఇటీవల షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక్క విచారకరమైన సంఘటనా చోటు చేసుకుంది..ఇక అసలు విషయానికి వస్తే సన్నీ ప్రస్తుతం ‘ఎటిఎం’ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని హస్తినాపురం కాలనీ లో జరుగుతుంది..షూటింగ్ సజావుగా సాగుతున్న సమయం లో అక్కడకి ఒక రౌడీ షీటర్ దౌర్జన్యం చేసుకుంటూ సెక్యూరిటీ ని మొత్తం ఛేదించి షూటింగ్ స్పాట్ లోకి అడుగుపెట్టాడు..నేరుగా సన్నీ ఉంటున్న కార్వాన్ లోకి చొరబడి అతనిని బయటకి లాగుకొని వచ్చి చితకబాదాడు..లొకేషన్ లో ఉన్న వాళ్లంతా ఏమి జరుగుతుందా అర్థం కాక నోరెళ్ళబెట్టి జరుగుతున్నా గొడవని చూస్తూ ఉన్నారు..ఇదంతా ప్రాంక్ ఏమో అని అనుకున్నారు అందరూ..కానీ సన్నీ శరీరం నుండి నిజంగా రక్తం కారడాన్ని గమనించిన తోటి నటీనటులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి అయ్యానని కారు ఎక్కించి ఆసుపత్రికి తరలించారు..సన్నీ పై జరిగిన దాడి గురించి తెలుసుకొని అతని తల్లి కంగారుపడిపోయింది..ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళండి నా బిడ్డపై దాడి ఎందుకు చేసారో ఇప్పటికి అర్థం కావడం లేదని సన్నీ తల్లి ఆరోపించింది.
తన పై దాడి జరిపిన ఆ రౌడీ షీటర్ పై సన్నీ షూటింగ్ స్పాట్ కి సమీపం లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు..ప్రస్తుతం ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు జరిపిస్తున్నారు..సన్నీ పై దాడి చేసిన రౌడీ షీటర్ ఎవరు..? వీళ్ళ మధ్య వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా..లేకపోతే ఎవరి దగ్గరైన సుపారీ తీసుకొని ఆ రౌడీ షీటర్ సన్నీ పై దాడి జరిపాడా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు..ఇది ఇలా ఉండగా సన్నీ ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..వాటిల్లో ‘ఎటిఎం’ మరియు ‘ అన్ స్టాపబుల్’ వంటి సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి..వీటితో పాటుగా ఒక్క ప్రముఖ నిర్మాత సన్నీ ని హీరోగా పెట్టి ఒక సినిమా తియ్యబోతున్నాడు..ఈ సినిమా వివరాలు తెలియాల్సి ఉంది..చిన్న రేడియో జాకీ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత యాంకర్ గా, సీరియల్ ఆర్టిస్టుగా..బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా..ఇప్పుడు హీరో గా ప్రయాణిస్తున్న సన్నీ కెరీర్ రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిప్పుకుంటుందో చూడాలి.