
ఈ సీజన్ బిగ్ బాస్ హౌయే మొత్తం వివాదాస్పదంగానే సాగింది..మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరుకు జరిగిన ఎలిమినేషన్స్ అన్నిటిని నిశితంగా పరిశీలిస్తే బిగ్ బాస్ యాజమాన్యం మొత్తం ఈసారి మోసపూరితంగానే వ్యవహరించిన విషయం అర్థం అయ్యిపోతుంది..ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఒకటి రెండు నిర్ణయాలు తీసుకోవడం అప్పుడప్పుడు సహజం,.కానీ సీజన్ మొత్తం అలాంటి నిర్ణయాలే తీసుకుంటే ఇక జనాలు ఓట్లు వెయ్యడం ఎందుకు..? మీకు నచ్చినవాళ్లకే ట్రోఫీ ఇచ్చుకుంటే అయిపోయేది కదా అంటూ బిగ్ బాస్ ని చూసే వీక్షకులు చెప్తున్న మాట..నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే లో శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరూ కూడా గెలిచారంటూ నాగార్జున ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే..రేవంత్ కి పది లక్షల రూపాయలు..అలాగేయ్ శ్రీహాన్ కి 40 లక్షల రూపాయలు దక్కాయి..అక్కడ వరుకు అంతా బాగానే ఉంది కానీ,శ్రీహాన్ కంటే రేవంత్ కి తక్కువ ఓట్లు వచ్చాయి అంటూ నాగార్జున చెప్పడం తీవ్రమైన వివాదాలకు దారి తీసింది.
ఎందుకంటే రేవంత్ కి వచ్చిన ఓటింగ్ శాతం ఎలాంటిదో బయట చూసే ప్రేక్షకులకు అందరికీ తెలుసు..కంటెస్టెంట్స్ కి బయటకి వచ్చిన తర్వాత రేవంత్ టైటిల్ గెలవబోతున్నాడు అనే విషయం అర్థం అయ్యింది..అతనికి వచ్చిన ఓటింగ్ శాతం లో శ్రీహాన్ కి సగం కూడా లేదు..అలాంటిది రేవంత్ కి అధికారిక ఓటింగ్ లో తక్కువ రావడం ఏమిటి..ఇదంతా మోసం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఇక హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆది రెడ్డి కూడా ఈ విషయం పై తన అభిప్రాయం పంచుకున్నాడు..’మా అందరికి రేవంత్ టైటిల్ గెలవబోతున్నాడు అనే విషయం తెలిసిపోయింది..అందుకే శ్రీహాన్ ని డబ్బులు తీసుకోమని ఆఫర్ వచ్చినప్పుడు తీసుకోమని చెప్పాము..కానీ చివరి నిమిషం లో నాగార్జున గారు ఇచ్చిన ట్విస్ట్ చూసి మా అందరి మైండ్ బ్లాక్ అయ్యింది..రేవంత్ కి తక్కువ ఓట్లు వచ్చాయి అంటే నమ్మశక్యంగా లేదు..ప్రజాభిప్రాయాన్ని ఎవ్వరూ అంచనా వెయ్యలేరు అని బయటకి వచ్చిన తర్వాత అర్థం అయ్యింది’ అంటూ ఆది రెడ్డి కామెంట్స్ చేసాడు.
ఇక శ్రీహాన్ తీసుకున్న డబుల్ స్టాండర్డ్స్ పై కూడా సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే..వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారమే నడుచుకుంటాను అంటూ ప్రగల్బాలు పలికిన శ్రీహాన్..చివరి నిమిషం లో అలా డబ్బులు తీసుకోవడం ఏంటో అని నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు..తాను టైటిల్ విన్ అవుతానని నమ్మకం ఉన్నప్పటికీ కూడా రేవంత్ ట్రోఫీ కావాలనే అనుకున్నాడు..చివరి నిమిషం వరుకు ఆ మాట మీదనే నిలబడ్డాడు..టైటిల్ విన్ అయినా తనకి తక్కువ ఓటింగ్ వస్తుంది అని తెలిసి కూడా రేవంత్ డబ్బు కోసం ఆశ పడలేదు..కంటెస్టెంట్స్ అందరూ హింట్స్ ఇచ్చినా కూడా తనకి క్యాష్ ప్రైజ్ తగ్గినా పర్లేదు, ట్రోఫీ వస్తే చాలు అనుకున్నాడు..కానీ శ్రీహాన్ 40 లక్షలు తీసుకోవడానికి ఒప్పుకోకపోయ్యుంటే రేవంత్ కి ట్రోఫీ కాదు కదా, కనీసం చిల్లి గవ్వ కూడా దక్కేది కాదని శ్రీహాన్ ఫ్యాన్స్ అంటున్నారు.