
తెలుగు బుల్లితెర పై ఇప్పుడు రికార్డు టీ ఆర్ పీ రేటింగ్స్ తో ముందుకి దూసుకుపోతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్4, ఈ షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు, ముఖ్యం గా అభిజీత్, ఈయన ఇప్పుడు బిగ్ బాస్ సీసన్ 4 టైటిల్ విన్ అయ్యే దశలో దూసుకుపోతున్నారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఈ షో ద్వారా ఆయన సాధించిన క్రేజ్ అలాంటిది మరి,ముఖ్యంగా అమ్మాయిల్లో అభిజిత్ క్రేజ్ వేరు, హౌస్ లో ఉన్న అందరి కాంటెటంట్స్ కంటే అభిజీత్ చాల నిజాయితీగా ఉన్నాడు అని , ముక్కు సూటి తనం తో పొయ్యే వ్యక్తిత్వవం ఉన్నవాడు అని ఆయనకీ ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా వెండితెర పై హీరోగా పరిచయం ఈ కుర్రాడు తన తోలి సినిమాతోనే చక్కటి నటన చూపి ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టాడు, శేఖర్ కముల దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలవగా ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’, ‘రామ్ లీల’, ‘అరెరే’ మరియు ‘కట్ చేస్తే ‘ వంటి సినిమాలు చేసిన ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు, ఆ తర్వాత చాల కాలం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో లో దర్శనం ఇచ్చిన అభిజీత్ గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
అభిజీత్ హైదరాబాద్ లో 1988 వ సంవత్సరం లో జన్మించాడు, 32 సంవత్సరాల వయస్సు గల ఈయన హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసుకున్నాడు,ఆ తర్వాత ఆయన విదేశాల్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ లో మాస్టర్ సైన్స్ ని పూర్తి చేసుకున్నాడు,అతని తండ్రి పేరు మన్మోహన్ మరియు తల్లి పేరు లక్ష్మి ప్రసన్న, వీళ్ళ ఫామిలీ ఫోటోని మీరు ఎక్సక్లూసివ్ గా క్రింద చూడవచ్చు, అభిజీత్ కి ఒక్క తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు అభయ్,అభిజీత్ ఫామిలీ కన్స్ట్రక్షన్ బిజినెస్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు , అతని తాతయ్య నాగయ్య హైదరాబాద్ లో ఒక్క ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ కి చైర్మన్, ఆదిలాబాద్ జిల్లాలో నిమనం అయినా ఫేమస్ కడెం ప్రాజెక్ట్ కూడా వీరి కన్స్ట్రక్షన్ కంపెనీ ఆద్వర్యం లోనే నిర్మాణం అయ్యింది,ఈ విషయం అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు.
ఇక అభిజీత్ విషయానికి వస్తే 2011 వ సంవత్సరం డిసెంబర్ లో ఆయన ఏరోక్ స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసాడు, అంతే కాకుండా స్టరైజ్ మోటో స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపె కి ఆయన డైరెక్టర్ గా కూడా పనిచేసాడు, ఆయన తన బిటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే ప్రముఖ దర్శకుడు శేఖర్ కముల టీం లో పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ నుండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోగా నటించాలి అనే ఆఫర్ వచ్చింది, తోలి నుండి సినిమాల అభిజీత్ కి పెద్దగా ఆసక్తి లేకపోయినా ఆడిషన్స్ లో యాక్టింగ్ ని మాత్రం అదరగొట్టేసరికి శేఖర్ కముల ఆశ్చర్యానికి గురి అయ్యి వెంటనే మరో ఆలోచన లేకుండా ఆయనని హీరోగా తీసుకున్నాడు, ఇప్పుడు యువతరం లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక్క చిన్న క్యారెక్టర్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ముందు అభిజీత్ పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ లో హీరోగా నటించాడు,ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే,ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ యాంకర్ వర్షిణి నటించింది.