Home Entertainment బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన రవితేజ ‘ధమాకా’..ఇది కదా రవితేజ మాస్ అంటే!

బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన రవితేజ ‘ధమాకా’..ఇది కదా రవితేజ మాస్ అంటే!

0 second read
0
0
503

మాస్ మహరాజా రవితేజ కెరీర్‌లో ధమాకా సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి డిజాస్టర్ల తర్వాత పూర్తిగా తన మార్కెట్ పడిపోయిన పరిస్థితుల్లో ధమాకా సినిమా అద్భుతం చేసిందనే చెప్పాలి. అది కూడా నెగిటివ్ టాక్ వచ్చిన మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం అంటే ఆశ్చర్యకరమే అని సినీ పండితులు అంటున్నారు. ఎందుకంటే క్రిస్మస్ కానుకగా గతనెల 23న విడుదలైన ధమాకా మూవీ పది రోజుల్లో నాన్ రాజమౌళి సినిమాల రికార్డులను తిరగరాస్తోంది. పదో రోజు కూడా అదిరిపోయే రీతిలో కలెక్షన్‌లు సాధించి ఔరా అనిపించింది. పదో రోజు ఆదివారం కావడంతో రూ.4.20 కోట్ల షేర్ వసూళ్లను ధమాకా రాబట్టింది. ఇప్పటివరకు చూసుకుంటే ఆర్.ఆర్.ఆర్, బాహుబలి సిరీస్ సినిమాలు మాత్రమే పదో రోజు ఈ స్థాయి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు వివరిస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో నిర్మితమైన ధమాకా సినిమాలో కథ పెద్దగా లేనప్పటికీ హీరో రవితేజ నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా ఒక రేంజ్‌లో వారికి కనెక్ట్ అయింది. దీంతో తొలి మూడు రోజుల్లోనే 30 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇటీవల ఆదివారంతో కలుపుకుని రూ.75 కోట్ల మార్కును అందుకోవచ్చని అందరూ భావించారు. కానీ 10వ రోజు వసూళ్లతోనే ఈ సినిమా రూ.77 కోట్ల మార్కును దాటేసింది. సక్సెస్ మీట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు ఈ సినిమా జోరు సంక్రాంతి వరకు కొనసాగేలా కనిపిస్తోంది. ఇదే నిజమైతే ధమాకా సినిమా రూ.100 కోట్ల మార్కును టచ్ చేసేదిలానే అనిపిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ ఏడాదిలో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి డిజాస్టర్లతో అభిమానులను నిరాశపరిచిన రవితేజ ధమాకాతో గ్రాండ్‌గా 2022కు గుడ్‌బై చెప్పాడు.

ధమాకా మూవీకి రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు హీరోయిన్ శ్రీలీలా కూడా ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాకుండా భీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ధమాకా మూవీని వీక్షించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. మీడియం బడ్జెట్ రేంజ్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రూ.18.30 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు భారీ లాభాలను సాధించడం పక్కాగా కనిపిస్తోంది. ఈ చిత్రం ఒక్క తెలుగు స్టేట్స్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా మాస్ రెస్పాన్స్‌తో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రీసెంట్‌గానే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్స్ మార్కుకు చేరుకోగా ఇప్పుడు 5 లక్షల 55 వేల యూఎస్ డాలర్స్ గ్రాస్ మార్కును చేరుకుంది. దీంతో ఈ చిత్రం రెస్పాన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటు నైజాం ప్రాంతంలో కూడా పది రోజులకు ధమాకా మూవీ రూ.12.5కోట్లకు పైగా వసూళ్లను సాధించి బయ్యర్లకు లాభాలను అందిస్తోంది. ఈ మూవీలో సచిన్ ఖేడ్కర్, తులసి, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, ప్రవీణ్, జయరాం, అలీ కీలక పాత్రల్లో నటించారు. గత శుక్రవారం అరడజను సినిమాలు విడుదలైనప్పటికీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబడుతుండటం గమనించాల్సిన విషయం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…